TTD: హైదరాబాద్‌లో రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు | Tirumala Laddu Available Daily In Hyderabad | Sakshi
Sakshi News home page

TTD: హైదరాబాద్‌లో రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

Sep 8 2024 8:34 AM | Updated on Sep 8 2024 8:34 AM

Tirumala Laddu Available Daily In Hyderabad

సాక్షి,హైద‌రాబాద్: న‌గ‌రంలోని శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమ‌ల ల‌డ్డూ ప్రతి రోజు హైద‌రాబాద్‌లో ల‌భ్యం కానుంద‌ని తెలిపింది. హిమాయ‌త్‌న‌గ‌ర్, జూబ్లీహిల్స్‌లోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో కేవ‌లం శ‌ని, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి ల‌డ్డూ విక్రయించేవారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఇక నుంచి ప్రతి రోజు ల‌డ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంద‌ని టీటీడీ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్ నిరంజ‌న్ కుమార్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.

ఒక్కో ల‌డ్డూను రూ. 50కు విక్రయించ‌నున్నారు. హిమాయ‌త్‌న‌గ‌ర్, జూబ్లీహిల్స్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ప్రతి రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ల‌డ్డూ విక్రయాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. భ‌క్తులు గ‌మ‌నించి, ల‌డ్డూ ప్రసాదాల‌ను కొనుగోలు చేయాల‌ని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement