కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
అచ్చంపేట: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరా జు సమర్థించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల కళ్లు కప్పి పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయ గా టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేయగా, రెండు వర్గాల కార్యకర్తలు బాహాబహీకి దిగారు.
దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ముట్టడికి వచ్చిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముట్టడి సమయంలో ఎమ్మెల్యే గువ్వల అక్కడ లేరు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ముందుగానే చెప్పడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ముట్టడికి ముందుగానే టీఆర్‌ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో సమావేశం కావడం వల్ల ఘర్షణకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడి ఉందని ముందుగానే తెలిసినా.. టీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు క్యాంపు కార్యాలయంలోకి అనుమతించడంపై విమర్శలు వస్తున్నా యి. టీఆర్‌ఎస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయం లో లేకపోతే ఘర్షణ జరిగేది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. డీఎస్పీలు నర్సింహులు, గిరిబాబు, సీఐలు అనుదీప్, రామకృష్ణ, గాంధీనాయక్, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment