సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది.
తొలుత సూసైడ్‌కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్‌కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది.
కౌన్సెలింగ్.. బెదిరింపులు?
మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment