స్వామివారికి కల్యాణం జరిపిస్తున్న చెంచు పూజారులు
నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం భౌరాపూర్‌పెంటలో చెంచుల ఆరాధ్య దైవం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించింది. చెంచులు భౌరమ్మను ఆడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి కల్యాణం నిర్వహించారు.
ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు స్వామివారి తరపున, కలెక్టర్ ఉదయ్‌కుమార్ దంపతులు అమ్మవారి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. చెంచుల గురువు గురువయ్య శివపార్వతుల కల్యాణం జరిపించారు. కాగా, సిద్ది పేటజిల్లా కొమురవెల్లిలో మంగళవారం రాత్రి పెద్దపట్నం వేశారు.
Comments
Please login to add a commentAdd a comment