‘జాతర’ విజయం ప్రేక్షకులకి అంకింతం: సతీష్‌ బాబు | Satish Babu Talk About Jathara Movie | Sakshi
Sakshi News home page

‘జాతర’ విజయం ప్రేక్షకులకి అంకింతం: సతీష్‌ బాబు

Nov 19 2024 5:27 PM | Updated on Nov 19 2024 7:13 PM

Satish Babu Talk About Jathara Movie

సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. ఓ కొత్త పాయింట్‌ని టచ్‌ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్‌ 8న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. సక్సెస్ ఫుల్ రెండు వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  జాతర సినిమా టీం సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా  డైరెక్టర్ , హీరో సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు నా  శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్  సినిమా విజయానికి కారణం. నవంబర్ 8 న మా సినిమాతో పాటు ఇంకో పది సినిమాలు పైన రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు మాకు అందించిన విజయం మాకు చాల ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు.

‘ఇంత చిన్న సినిమాకి అంత గుర్తింపు రావడం అంత ఈజీ కాదు. ఒక వారం పాటు ఎక్కడ ఆగకుండా మా జాతర సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడి రెండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇది మేము చాల గర్వంగా ఫీల్ అవుతున్నాం’ అన్నారు నిర్మాత ద్వారంపూడి శివ శంకర్‌ రెడ్డి. 

విష్ణు గారు మాట్లాడుతూ.. ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు నేను పల్లెటూరు, గ్రామా దేవత కాన్సెప్ట్ అన్నప్పుడే  నేను ఈ సినిమాకి  కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన రూట్స్ ని మనం మర్చిపోము కదా, ఆ విషయం లో నాకు ఈ సబ్జెక్టు బాగా కనెక్ట్ అయింది. అయితే డైరెక్టర్ సతీష్ గారే హీరోగా  ఎలా చేస్తారో  అనుకున్నాను, కానీ ఈ సినిమాకి అతని నటన ప్లస్ అయింది. మిగతా టెక్నిషియన్స్ ,ఆర్టిస్టులు కూడా చాల బాగా పర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా చేసినందుకు నేను  చాల గర్వపడుతున్నాను’ అన్నాను. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement