సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వంగూరు: కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఆయన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలు రోడ్లమీదకు వచ్చి టపాకాయలు కాల్చి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. మా మధ్యలో పెరిగిన మా రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
విద్యార్థి దశ నుంచే తెలివైనవాడు
రేవంత్‌రెడ్డి తాండ్ర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివినప్పుడు నేను టీచర్‌గా పనిచేశాను. అప్పుడే తరగతిగదిలో రేవంత్ మ క్కువను నేను గమనించేవాడిని. భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతాడ ని అనుకున్నాను. నేను చదువు చెప్పిన విద్యార్థి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది. – జగన్‌మోహన్‌రెడ్డి, రిటైర్డ్ హెచ్‌ఎం, తాండ్ర
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి
రేవంత్‌రెడ్డి నాకు క్లాస్‌మేట్, బంధువు కూడా. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయా లపై ఆసక్తి ఎక్కువ. చదువులోనే కాకుండా ఆటల్లోనూఉత్సాహం కనబరిచేవాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో, 6వ తరగతి తాండ్ర గ్రామంలో చదువుకున్నాం. నా స్నేహితుడు రాష్ట్రానికి సీఎం కావడం ఎంతో గర్వంగా ఉంది. – కేవీఎన్ రెడ్డి, వంగూరు జెడ్పీటీసీ, రేవంత్‌రెడ్డి స్నేహితుడు
నా సంతోషానికి అవధుల్లేవు
రాజకీయ నేపథ్యం లేకున్నా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నా స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాతో పాటు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాం. ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం. – ధర్మారెడ్డి, రేవంత్‌రెడ్డి స్నేహితుడు
Comments
Please login to add a commentAdd a comment