ఇవాళో రేపో విగ్రహాన్నీ ప్రభుత్వం కూల్చేస్తుంది
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి
తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటుచేయాలి
రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహం.. పచ్చమూక దాడిపై నిరసనల వెల్లువ
సాక్షి ప్రతినిధి విజయవాడ/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేడ్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు.
నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా పెట్టిన విగ్రహం అని చెప్పారు. నగరం నడి»ొడ్డులో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందన్నారు.
రేపోమాపో కూల్చి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణ జరిపించడమే కాక.. బాధ్యులను అరెస్టు చేయాలన్నారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని, అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిõÙకం చేయాలని వారంతా పిలుపునిచ్చారు.
ఏపీ చరిత్రలో చీకటి రోజు
రాష్ట్ర చరిత్రలో గురువారం ఒక చీకటి రోజు అని, స్వయంగా ప్రభుత్వమే దాడి చేయించడం దారుణం అని మాజీమంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. దేశానికే ఐకానిక్‌గా ఉన్న ఈ విగ్రహ విధ్వంసానికి సర్కారు తెగించడం చూసి.. విగ్రహ కమిటీ చైర్మన్‌గా పని చేసిన తన హృదయం చలించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్ కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. చరిత్ర క్షమించదు. అధికార పార్టీ పెద్దల సూచనలు, ఆదేశాలతోనే ఈ దాడి జరిగింది.
ఇది దేశం తల దించుకోవాల్సిన ఘటన’ అని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినా‹Ù, పార్టీ నేత పోతిన మహేష్, దళిత నేత పరిశపోగు శ్రీనివాసరావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీగా సీపీ కార్యాలయానికి వెళ్లి డీసీపీ హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తొలగించిన మాజీ సీఎం పేరును తిరిగి ఏర్పాటు చేయాలని, విగ్రహానికి పటిష్ట భద్రత కల్పించాలని కోరారు.
సీఎం ప్రమేయంతోనే విగ్రహంపై దాడి
మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సాక్షి, అమరావతి: భారతరాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అంటేనే సీఎం చంద్రబాబుకు గిట్టదనే విషయం పలుమార్లు స్పష్టమైందని, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి విగ్రహంపై దాడి ఆయన ప్రమేయంతోనే జరిగిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో అంబేడ్కర్ విగ్రహం పెట్టండని అడిగినందుకు కేసులు పెట్టించారని తెలిపారు. ఇవాళ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలాన్ని.. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన వారికి అప్పనంగా అమ్మేయాలని కుట్రలు చేస్తే ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.
టీడీపీ నైజం మరోసారి బయటపడింది: మాజీ ఎంపీ సురేష్
అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటన ద్వారా చంద్రబాబు, టీడీపీ నేతల నైజం మరోసారి బయట పడిందని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్షేపించారు. హామీలు అమలు చేయకుండా, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు, టీడీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారని.. ఇందులో భాగంగానే అంబేడ్కర్ విగ్రహంపై దాడి అని చెప్పారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో చంద్రబాబు కక్ష పెంచుకుని, ఇలా అక్కసు వెళ్లకక్కుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment