
సాక్షి, గుంటూరు : శాకమూరులో రాజ్యాంగ సృష్టి కర్త అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిన తెలుగుదేశం ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. అంబేడ్కర్ స్మృతి వనం వద్ద వైస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జునతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనదీక్షకు దిగారు. ఇచ్చిన హామీ ప్రకారం శాకమూరులో 125 అగుడుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన శాకమూరు చేరుకున్నారు. మేరుగ నాగార్జునతో పాటు ఇతర నాయకుల, పార్టీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అమరావతి పోలీస్ స్టేషన్ తరలించారు. అయినా వైఎస్సార్‌సీపీ నేతలు పట్టువిడకుండా పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. వైస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన కారులకు తమ మద్దతు తెలిపారు.