సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.
రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment