చింతలపూడి (పశ్చిమగోదావరి) : విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమవారం చింతలపూడిలో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలు ముట్టడించారు. సిబ్బందిని వెలుపలికి పంపించి ఆందోళన కొనసాగిస్తున్నారు.