ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దని ధర్నా | women stage dharna against liquor shops | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 29 2015 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దని కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గుజ్జూరు గ్రామ మహిళలు సోమవారం కంచికచర్ల ఎక్సైజ్‌పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇటీవలే మద్యం దుకాణాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన విషయం తెలుసుకున్న మహిళలు వెంటనే వాటిని తొలగించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ, సీపీఎంలు మద్దతు తెలిపాయి. ఈ ధర్నాలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement