
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల విమర్శలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు స్థాయిని చూసి మాట్లాడాలని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యం షాపులు తెరవడం కేంద్ర నిర్ణయం అని తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతో మీ బుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిందని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. ద్రోహం చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకుండా విమర్శలు చేయడంపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే బాబురావు హితవు పలికారు.
(ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..)
Comments
Please login to add a commentAdd a comment