కూటమి ప్రభుత్వం మద్యం విధానంతో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, అడుగడుగునా బెల్ట్ షాపులు, దీంతో తాగడానకి నీళ్లు దొరకవేమో కానీ రాష్ట్రంలో మద్యానికి మాత్రం కొరత లేకుండా పోయింది. ఇక బాబుగారు సూపర్ సిక్స్‌లో భాగంగా రూ. 99కి ఇస్తున్న క్వార్టర్ మద్యం నాణ్యతకి ఎక్కడ తాగినవాళ్లు అక్కడే పడిపోతున్నారు.
నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో మద్యం తాగి స్పృహలేని స్థితిలో ఓ మహిళ, అదే స్థితిలో మరోవ్యక్తి ట్రాలీ రిక్షాలో పడి ఉండగా, కాస్త మెరుగ్గా ఉన్న మరో వ్యక్తి ఆ ట్రాలీని లాక్కుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment