
రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్‌డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్‌డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్‌షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమికూడారు.
కోవిడ్ రూల్స్ పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్, బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
చదవండి: తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్
తెలంగాణలో లాక్‌డౌన్: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment