సాక్షి, హైదరాబాద్: ఈనెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మ ద్యం దుకాణాల మూసివేత గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొం త వెసులుబాటు కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసే ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment