april 14th
-
14 వరకు మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మ ద్యం దుకాణాల మూసివేత గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొం త వెసులుబాటు కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసే ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘2.0’ ముందుకు వస్తుందా?
రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ రోజు. అలాంటిది పండగ రోజు ఆయన సినిమా విడుదలైతే డబుల్ ఫెస్టివల్. వచ్చే సంవత్సరాది (ఏప్రిల్ 14) రజనీకాంత్ అభిమానులకు టూ ఫెస్టివల్స్. ఒకటి తమిళ న్యూ ఇయర్. ఇంకోటి ‘2.0’ రిలీజ్. అదేంటీ.. ఏప్రిల్ 27న కదా ‘2.0’ రిలీజ్ అనుకుంటున్నారా? లేదట. ‘ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం’ అని శనివారం ‘ఫ్యాన్స్ మీట్’లో రజనీకాంత్ పేర్కొన్నట్లుగా వార్త షికారు చేసింది. ‘‘2.0 చాలా గ్రాఫిక్స్‌తో కూడుకున్న సినిమా. అందుకే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అందుకే జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఎన్నిసార్లు వాయిదా పడినా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్ విషయంలోనే కాదు కంటెంట్ పరంగా కూడా చాలా గొప్ప సినిమా ఇది. తమిళంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలాగా చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలిచిపోతోంది. దర్శకుడు శంకర్ చాలా యునిక్ పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పబోతున్నాడు. ‘కాలా’ సినిమాలో కొత్త డైమెన్షన్లో కనిపిస్తాను. ఒక కొత్త రజనీకాంత్‌ను దర్శకుడు పా.రంజిత్ మీ అందరికి చూపించబోతున్నాడు’’ అని రజనీకాంత్ ‘2.0, కాలా’ గురించి ఫ్యాన్స్‌తో పలు విశేషాలు పంచుకున్నారు. ఇంత చెప్పారు కదా సార్.. మరి రాజకీయల గురించి ? అని అడిగితే ‘‘ఇంకొక్క రోజు ఆగండి’’ అన్నారు. ఆ ఇంకొక్క రోజు ఈరోజే (ఆదివారం). సో.. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకూ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని రజనీ ఈసారి మాత్రం స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పేయాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ మీట్లో రజనీ తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకుడు కె.బాలచందర్ గురించి మాట్లాడారు. ‘‘బాలచందర్‌గారిని నేను మొట్టమొదటిసారి కలసినప్పుడు తమిళ్ నేర్చుకోమన్నారు. మూడు సినిమాలకు నన్ను బుక్ చేసుకున్నారు. బాలచందర్‌గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని, నేను స్టార్ అయ్యాక దర్శకుడు ఎస్. పి. ముత్తురామన్గారు, మణిరత్నంగారు, సురేష్కృష్ణగారు.. నన్ను సూపర్ స్టార్‌ని చేశారు. ‘రోబో’ సినిమాతో శంకర్ నన్ను జాతీయ స్థాయి నటుణ్ణి చేశారు’’ అని రజనీ అన్నారు. వాస్తవానికి ‘రోబో’కన్నా ముందే రజనీ జాతీయ స్థాయి నటుడే. అయితే శంకర్ పేరుని సూచించడం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే... ఒకవేళ ‘2.0’ నిజంగానే ఏప్రిల్ 14న విడుదలైతే ఇక్కడ మన రెండు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు (‘భరత్ అనే నేను) హీరోగా రూపొందుతోన్న సినిమా. ఇంకొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వాస్తవానికి ముందు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 27) ప్రకటించింది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రబృందమే. ఆ తర్వాత అదే తేదీని మహేశ్‌బాబు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం శ్రేయస్కరం కాదు కాబట్టి, రెండు చిత్రాల నిర్మాతలిద్దరూ కలసి సామరస్యంగా మాట్లాడుకుని, ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. -
విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
రాజంపేట టౌన్ : విద్యార్థులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి సీ.చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ‘అంబేడ్కర్ జీవితం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్‌పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చెన్నయ్య ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగానే భారతదేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని చెన్నయ్య తెలిపారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎన్.శివరామయ్య, ధర్మరాజు నాయక్, ఎం.రాజయ్య, జీ.పెంచలయ్య, డి.చెంగల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ఏప్రిల్ 14 నుంచి వాలీబాల్ టోర్నీ’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బంజారాలకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీని ఏప్రిల్ 14 నుంచి నిర్వహిస్తున్నట్లు సేవాలాల్ ట్రస్ట్ అర్బన్ అధ్యక్షులు మహేష్‌నాయక్ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అండర్–25 వాలీబాల్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలోని ఆర్డీటీ పాఠశాలలో ఏప్రిల్ 14 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు తమ జట్ల పేర్లను ఏప్రిల్ 10లోగా నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.10116, రెండవ బహుమతిగా రూ.5116 ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 9492222233, 9652427520 నెంబరుకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరమేష్‌నాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటరమణ, రాజు, వినోద్, గోపాల్, శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.