ఇంతలా.. గెంతాలా..? | Alcohol Sales in Hyderabad Youth Drunk And Conflicts | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో...

Published Thu, May 7 2020 7:32 AM | Last Updated on Thu, May 7 2020 9:25 AM

Alcohol Sales in Hyderabad Youth Drunk And Conflicts - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పొద్దున్నే 7 గంటలకు ఓ వ్యక్తి ఇందిరానగర్‌లోని సాయి వైన్స్‌ వద్దకు చేరుకున్నాడు.. వైన్స్‌ తెరవగానే తొలి కస్టమర్‌ కావడంతో అతడికి దండేసి మరీ మద్యం అందించారు.. సీన్‌ కట్‌చేస్తే.. సాయంత్రం ఆ వ్యక్తి  ఇందిరానగర్‌లోనే ఫుల్లుగా మందేసి ఇలా అర్ధనగ్నంగా కనిపించాడు. 
ఫోటోలు -దయాకర్‌ తూనుగుంట్ల

అబిడ్స్‌: బర్కత్‌పురకు చెందిన మహేష్‌(30) బుధవారం సాయంత్రం గౌలిగూడలోని ఓ వైన్‌షాప్‌లో మందు కొనుగోలు చేసి సమీపంలోనే సేవించాడు. తాగిన మైకంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని అక్కడిక్కడే విద్యుదాఘాతంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మహేష్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు.  

యాక్సాబ్లేడ్‌తో దాడి

చాంద్రాయణగుట్ట: తాగిన మైకంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛత్రినాక పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన పర్వతాలు అలియాస్‌ రాజు (58) మద్యం మత్తులో యాక్సాబ్లేడ్‌తో బుధవారం రాత్రి రాయుడు (48) అనే వ్యక్తిపై దాడికి దిగి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement