సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. చదవండి: 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే'
తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు 75శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మే 4న రూ.70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. మే 9 నాటికి రూ. 40.77 కోట్లకు చేరుకున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. తాజాగా మరో 13 శాతం మద్యం షాపుల తొలగింపు నిర్ణయంతో మద్యం విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి. చదవండి: వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment