Liquor prohibition
-
బిహార్‌లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
సొంత ప్రభుత్వంపై జేడీయూ నేత సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో సీఎం!
బిహార్‌లో మద్యపాన నిషేధంపై అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం పూర్తిస్థాయిలో విజయవంతం అవ్వలేదని జనతాదళ్ యూనైటెడ్ పార్టమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుశ్వాహ ఆరోపించారు. రాష్ట్రంలో అక్కడక్కడా మద్యపానం జరుగుతోందని, దీని ద్వారా నేరాల సంఖ్య పేరుగుతోందని పేర్కొన్నారు. కాగా సొంత ప్రభుత్వంపై జేడీయూ నేత విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కుశ్వాహా వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా జేడీయూ నేత మాట్లాడుతూ.. లిక్కర్ అమ్మకాలను ఆపేస్తే మద్యం సేవించడం ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోందని.. కేవలం ప్రభుత్వం అమ్మకాలు ఆపేసినంత మాత్రాన సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప మద్యం నిషేధం విజయవంతం అవ్వదన్నారు. బిహార్‌లో చట్టాల ద్వారా ప్రభుత్వం మద్యపాన విక్రయాన్ని మాత్రమే ఆపగలిగింది కానీ, మద్యపాన సేవనాన్ని నిరోధించలేకపోయిందని విమర్శించారు. చదవండి: ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే.. అమ్మకానికంటే ముందు తాగడం మాన్పించాలని సూచించారు. బిహార్‌లో మద్యనిషేధంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతం కాలేదు. పలుచోట్ల మద్యం వినియోగిస్తున్నారు. దొంగచాటు విక్రయాల వల్ల నేరాలు పెరుతున్నాయని. నిషేధాన్ని మరింత కఠినంగా ఆమలు చేస్తే నేరాలు తగ్గి సమాజం మరింత బాగుపడుతంది’ అని కుశ్వాహ అన్నారు. అయితే జేడీయూ నేత వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. ఉపేంద్ర కుష్వాహ నితీష్ కుమార్ కంటే నిజాయితీగల సోషలిస్టు అని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ పేర్కొన్నారు. మద్యపాన నిషేధం విఫలమవ్వడం కారణంగా రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. -
ఆపరేషన్ దుర్యోధన సీన్! ఒంటి మీద నూలుపోగు లేకుండా..
పోసాని డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘ఆపరేషన్ దుర్యోధన’ గుర్తుంది కదా. ఎంత మంది చూశారో తెలియదుగానీ.. అందులో హీరో ఇంట్రో సీనే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఒంటి మీద నూలు పోగులేకుండా భగవంతుడు(శ్రీకాంత్ క్యారెక్టర్) నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంటుంది. అది చూసి షాక్ తిన్న పోలీసులు.. బ్యానర్ కట్టి పక్కకు తీసుకెళ్తారు. దాదాపుగా ఇలాంటి సీనే ఒకటి రియల్ లైఫ్‌లో జరిగింది. నగ్నంగా రోడ్ల మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఓ పోల్కి ఉన్న బ్యానర్లు కట్టి పక్కకు తీసుకెళ్లారు. తీరా అదుపులోకి తీసుకున్నాక అతనొక రాజకీయ నేత అని, పైగా అధికార పక్షానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కంగుతిన్నారు. పార్టీ దృష్టిలో పడేందుకే తాను అలా సమాధానం ఇవ్వడంతో బిత్తరపోయారు. బీహార్ నలంద జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లాంపూర్ నియోజకవర్గ జేడీయూ యూత్ వింగ్ లీడర్ జయ్ ప్రకాశ్ అలియాస్ కరూ.. నగ్నంగా రోడ్ల మీద హల్ చల్ చేశాడు. సొంత గ్రామం జగదీష్పూర్లో ఫుల్‌గా మద్యం సేవించి.. ఒంటి మీద దుస్తులు విప్పదీసి రోడ్డెక్కాడు. ఆపై అక్కడే ఉన్న ఓ లోకల్ లీడర్ ఇంటికెళ్లి.. అతని కాళ్ల దగ్గర కూర్చున్నాడు. తన గురించి పట్టించుకోవాలని, పార్టీ కోసం గొడ్డులా కష్టపడుతున్నానంటూ బతిమాలుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడో అని భయపడి ఆ లీడర్ గప్‌చుప్‌గా ఉండిపోయాడు. नालंदा- शराब के नशे में जेडीयू नेता ने उतार दिये कपड़े JDU के विधानसभा प्रभारी का नशे में नंगे होने का वीडियो सोशल मीडिया पर वायरल@Jduonline @bihar_police @dmnalanda @RjdNalanda @RJDforIndia @RJD_BiharState @INCBihar @LJP4India @sshaktisinghydv @PremChandraMis2 #Bihar pic.twitter.com/boHq1MoSsm — FirstBiharJharkhand (@firstbiharnews) February 23, 2022 కాసేపటికి కరూ సోదరుడు వచ్చి.. అతన్ని బయటకు లాక్కెళ్లాడు. లిక్కర్ ప్రొబిహిషన్ ఉండడంతో ఇంట్లోనే ఉండాలంటూ బతిమాలుకున్నాడు. కానీ, మాట వినని కరూ.. ‘నన్నెవరూ ఏం పీకలేరంటూ’ తెగ వాగుతూ మళ్లీ రోడ్డెక్కి వీరంగం వేశాడు. ఈ నిరసనతో అయినా పార్టీ తనని గుర్తించాలంటూ కేకలు వేశాడు. అదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్పటికప్పుడే వైరల్ కావడం.. నిమిషాల వ్యవధిలో పోలీసుల దృష్టికి వెళ్లడం.. ఆపై కరూ కటకటాల వెనక్కి వెళ్లడం బుల్లెట్ స్పీడ్‌తో జరిగిపోయాయి. లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అతన్నిఅరెస్ట్ చేసినట్లు ఇస్లాంపూర్ పోలీసులు వెల్లడించారు. కరూ కోరుకున్నట్లే అధిష్టానం దృష్టిలో పడ్డాడు. కానీ, ఫలితం మరోలా ఉంది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఇస్లాంపూర్ జేడీయూ బ్లాక్ ప్రెసిడెంట్ తన్వీర్ అలం ప్రకటించాడు. -
సత్ఫలితాలు ఇస్తున్న సీఎం జగన్ నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. చదవండి: 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు 75శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మే 4న రూ.70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. మే 9 నాటికి రూ. 40.77 కోట్లకు చేరుకున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. తాజాగా మరో 13 శాతం మద్యం షాపుల తొలగింపు నిర్ణయంతో మద్యం విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి. చదవండి: వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్ -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్‌షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
-
టీడీపీ కార్యకర్తలకు ఉపాది అవకాశం బెట్లు షాపులు ఇచ్చరు
-
ప్రతిపక్షం కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసింది
-
గత ప్రభుత్వంలో వరుణ వాహిని పేరుతో మధ్యం ప్యాకెట్లు
-
అన్ని అనర్థాలకు మద్యమే కారణం: భూమన
-
పులిహోర తింటే పులి అయిపోరు: రోజా
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ‘ఎన్ని కష్టాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ ఆయన నెరవేర్చుతున్నారు. అలాంటివారిని పులి అంటారు కానీ... పులిహోర బ్యాచ్‌ను పులి అనరు’ అని ఆమె వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...‘ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు అవుతుంది. నారావారి సారా పాలన నుంచి విముక్తి లభించింది. చంద్రబాబు హయాంలో సరైన వర్షాలు పడలేదు. కృష్ణానదికి ఏనాడు వరద రాలేదు. రాష్ట్రంలో మాత్రం మద్యం ఏరులై పారింది. చంద్రబాబుది విజన్ 2020 కాదు...విజన్ 420. గత అయిదేళ్లలో రూ.75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మరి చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదు. మద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. అన్నిటీకి అనర్థం మద్యమే. గత అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. ’ అని మండిపడ్డారు. చదవండి: ఇంత దారుణమా చంద్రబాబూ..! ఆరు నెలల్లోనే దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. 43వేల బెల్ట్ షాపులను తొలగించి, 40 శాతం బార్లు కూడా తగ్గించారు. గతంలో ఉన్న నాలుగువేలకు పైగా పర్మిట్ రూమ్‌లను తొలగించారు. ఇచ్చిన మాటను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇన్నాళ్లు చరిత్రను విన్నాం, చదివాం. మొట్టమొదటిసారిగా సీఎం జగన్ పాలనలో చరిత్రను రాయడం చూస్తున్నాం. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి మహిళా అభినందిస్తుంది. సీఎం జగన్ దేశంలో లేనివిధంగా పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంటి యజమాని మద్యానికి బానిస అయితే ఆ ఇల్లు నరకమే. మద్యపాన నిషేధం అమలుపై... ఆదాయం కోల్పోతామని, అమలు చేయలేమని, మగవాళ్లు ఓట్లు వేయరంటూ చాలామంది మాట్లాడారు. అయితే ఆదాయం కాదు ...ఆడవాళ్ల సౌభాగ్యం ముఖ్యమని సీఎం జగన్ మద్యపాన నిషేధంపై కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అన్ని అనర్థాలకు మద్యమే కారణం: భూమన అంతకు ముందు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ...అన్ని అనర్థాలకు మద్యమే కారణమని అన్నారు. జీవితాలను సర్వనాశనం చేసేది మద్యమే అని, మనుషులను మృగాలుగా మార్చే మహమ్మరి మద్యం అన్నారు. చంద్రబాబు హయంలో మద్యం విక్రయాలు పెరిగాయన్న భూమన మద్యం మానవ మనుగడకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. -
పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతున్నారు
-
మద్యమే ఎన్నో అనర్థాలకు కారణం: నారాయణ స్వామి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 43వేల బెల్ట్‌షాపులు తొలగించిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం గుంటురూలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయవనరుగా చూడటం లేదని పేర్కొన్నారు. సమాజంలో మద్యమే ఎన్నో అనర్థాలకు కారణమని నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. -
‘ఆర్థికంగా ఇబ్బందైనా లక్ష్యం కోసం పనిచేస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్య నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మద్య నిషేధమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో ఎంతోమంది మహిళలు మద్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారని, సీఎం అయ్యాక ఆయన ఆ దిశగా చర్యలు చేపట్టారని వెల్లడించారు. విమోచన కమిటీలో లక్ష్మణరెడ్డికి బాధ్యతలు అప్పగించారని హోంమంత్రి తెలిపారు. -
పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు
సాక్షి, అమరావతి : పాక్షిక మద్య నిషేధం దిశగా నూతన ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అమ్మకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులకు అప్పగించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు నాలుగు కమిటీలు ఖరారయ్యాయి. షాపులు, ప్రదేశాల ఎంపిక, కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకం, మద్యం షాపుల్లో ఫర్నిచర్, మౌలిక సదుపాయాల కల్పనకు, డిపోల నుంచి షాపులకు సరుకు రవాణా చార్జీలను ఖరారు చేసేందుకు ఈ నాలుగు కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్ల ద్వారా పారదర్శకత... నూతన పాలసీలో అన్నీ టెండర్ల ద్వారానే చేపట్టి పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. సిబ్బంది. నియామక ప్రక్రియ మినహా మిగిలిన అన్నింటికీ (షాపుల్లో ఫర్నిచర్, రవాణా చార్జీల ఖరారు, షాపులకు అద్దె) టెండర్లు నిర్వహించనున్నారు. అన్ని కమిటీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లు చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఆయా డిపోల నోడల్ మేనేజర్లు వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా ఆయా జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, మద్యం షాపు ఏర్పాటయ్యే స్టేషన్ హౌస్ ఆఫీసరు, డిపో మేనేజర్లు ఉంటారు. మద్యం సరుకు రవాణా చార్జీల నిర్ణయ కమిటీలో రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసరును సభ్యుడిగా నియమించారు. ఉపాధిలో బీసీలకు ప్రాధాన్యం... అక్టోబర్ నుంచి మొదలయ్యే ప్రభుత్వ దుకాణాల్లో 15 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం మొత్తం 50 శాతం రిజర్వేషన్లను కల్పించారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమల్లో భాగంగా తొలి దశలో 20 శాతం మేర మద్యం షాపుల్ని తగ్గించనున్నారు. మొత్తం 4,380 మద్యం షాపులు ఉండగా వాటిలో 880 షాపులు తగ్గనున్నాయి. అంటే 3,500 మద్యం షాపులు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. ఉద్యోగాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ 15 వేల ఉద్యోగాల్లో 7,500 ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 శాతం దక్కనున్నాయి. అంటే 7,500 ఉద్యోగాలు ఈ వర్గాలకు కేటాయించాలి. ఉద్యోగాల కల్పనలో భాగంగా సూపర్వైజర్కు మండలం యూనిట్‌గా, సేల్స్‌మెన్‌కు గ్రామం యూనిట్‌గా స్ధానికతను నిర్ధారిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వ మద్యం షాపులో పోస్టుల సంఖ్య అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇలా... ఉద్యోగం అర్బన్ గ్రామీణం సూపర్ వైజర్ 1 1 సేల్స్‌మెన్ 3 2 సెక్యూరిటీ గార్డ్ 1 1 -
‘మద్యం కోసం పుస్తెలతాడు తెంచుకెళ్లాడు’
సాక్షి, కైకలూరు : సౌదమణి : ఏంటి.. శ్యామలక్కా.. మెడలో పసుపుకొమ్ములతాడు వేలాడుతోంది.. పుట్టింటోళ్లు పెట్టిన బంగారు పుస్తులేమైనావి.. శ్యామల : (కన్నీరు బడబడా కారుస్తూ) నా బాధ ఏ ఆడబ్డికు రాకూడదు చెల్లీ.. కట్టుకున్నోడు కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని చూస్తాడనుకున్నా.. మాయదారి మద్యం అలవాటైంది.. మా ఆయన రాత్రి తాగుడికి డబ్బులడిగాడు.. లేవన్నాను.. బలవంతంగా పుస్తులు తెంచుకెళ్లిపోయాడు.. సౌదమణి : ఆరే.. ఇటు చూడని.. మోడ కూడా కోసుకుపోయింది.. ఇంత అఘాయిత్యానికి ఆయనకు చేతులెలా వచ్చాయి.. ఇటురా మందు రాస్తా.. శ్యామల : చెల్లీ.. ఈ మందు రాస్తే.. గాయం మానుతుందేమోగాని.. ఆయన ఆ మందు మానటం లేదే.. సర్కారోళ్లు.. మద్యంలో ఆదాయం చూస్తున్నారే కాని.. మన జీవితాలు నాశనం అవుతున్నా.. పట్టించుకోవడం లేదు.. సౌదమణి : అవునక్కా.. ప్రభుత్వం నడవాలంటే మద్యం అదాయం ఒక్కటే సంజీవిని అనుకుంటున్నారు వాళ్లు.. ఏసీ గదులు వదిలి.. మన పేదల బస్తీలకు వస్తే తెలుస్తుంది.. ఎన్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయో.. తిరుపతమ్మ : వీధిన పడటమంటే గుర్తొచ్చింది.. సౌదమణి.. పాపం మన సీతాలు ఆయన తాగి, తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోయాడు.. ముగ్గురు ఆడపిల్లలు. ఆమె జీవితం ఏం కావాలి.. పిల్లల్ని చదువులు మాన్పించి కూలీ పనులకు పంపుతోంది.. సీతాలు ఇళ్లల్లో పాచి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. సౌదమణి : ఒక్క సీతాలు జీవితామే కాదు.. తిరుపతమ్మ.. మనబస్తీలో మద్యం మహమ్మారికి సర్వనాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. ఒక్కొక్కరిదీ ఒక్కో గాధ.. వింటుంటే కన్నీరు ఆగదు.. ఫాతిమా : (అందరికీ టీ తెస్తూ) అందరూ.. బాగున్నారా.. మంచి గరం..గరం అల్లం ‘టీ’ మీ కోసం తెచ్చా.. తాగండి.. ఓయ్.. శ్యామల ఏంటీ ఏడుస్తున్నావ్.. మీ అత్త మళ్లీ టార్చర్.. పెట్టిందా..? తిరుపతమ్మ : ఫాతిమా.. ఎప్పుడూ.. వాళ్ల అత్తమీదే.. నీ అక్కసు.. శ్యామల వాళ్లయిన రాత్రి తాగి.. పుస్తులతాడు తెంపుకెలిపోయాడంటా.. ఫాతిమా : అయ్యోయ్యో.. ఎంత పనిచేశాడు.. అలాంటోళ్లను పోలీసులతో చితక్కొంటిం చాలి.. అప్పుడు కాని బుద్ధిరాదు.. శ్యామల : ఓయ్.. ఫాతిమా.. మా ఆయనను పోలీసుతో కొట్టించమంటున్నావు ఏంటీ.. ఎంతైనా నన్ను కట్టకున్నాడు.. కొట్టినా.. పెట్టినా ఆయనే.. నాకు.. ఫాతిమా : ఇదిగో.. ఈ సెంటిమెంట్లే మన జీవితాలను పాడు చేస్తున్నాయి.. ఒక్క సారైన బుద్ధి రావాలి కదా.. అక్కా.. ఇలాగే ఉంటే వాళ్లలో మార్పు రాదు.. సువార్త : ఏమ్మా.. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.. పక్కంటి ప్రెండ్ ఒకటుందని మర్చిపోయారా ఏంటీ.. ఫాతిమా : అదేం కాదు.. ఇదిగే ముందు అల్లం టీ తాగు.. ఇక్కడ మగాళ్ల తాగుడు గురించి మాట్లాడుకుంటున్నాం.. సువార్త : ఏం.. తాగుడో ఏమిటోనమ్మా.. ఈ మద్య మందు షాపులు ఊరి చివర్లో పెట్టారని ఎంతో సంతోషపడ్డా.. ఇప్పుడు బస్తీలోనే ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు వచ్చేశాయి.. అంత దూరం వెళ్లలేక ఇక్కడే బడ్డికొట్లలో అమ్మేస్తున్నారు.. రాత్రి వేళ.. కుర్రోళ్లు.. ఒకటే తాగుడు.. చిందులు.. నిద్రపట్టడం లేదు.. ఈ పీడ ఎప్పుడు విరగడవుతోందో.. ఏమో.. సౌదమణి : సువార్త.. అసలు ఈ ప్రభుత్వాన్ని కడిగేయాలి.. మొన్న ఎన్నికల్లో ఏమన్నారు.. బెల్టు షాపులు ఒక్కటి కూడా లేకుండా చేస్తామన్నారు.. హామీలు ఇవ్వడమే కాని అమలు చేయడం వీళ్లకు తెలీయదేమో.. సువార్త : అవునక్కా.. ఈ మధ్య రాజన్న తనయుడు తమ ప్రభుత్వం వస్తే మూడు దశల్లో మద్య నిషేధం చేస్తానన్నాడు.. జరుగుతుందంటావా.. సౌదమణి : చూడు.. సువార్త.. వాళ్ల నాన్నకు మల్లే ఈయన మాటమీద నిలబడే వ్యక్తి. మొదటి దశలో బెల్టు షాపులు లేకుండా చేయడం, రెండో దశలో మద్యం ధరలు పెంచడం, మూడో దశలోపెద్దహోటల్స్లోమాత్రమే మద్యం ఉండేవిధంగా చేస్తానన్నారు.. సువార్త : అవునక్కా.. ఇదే జరిగితే మన జీవితాలు బాగుపడతాయి అంటూ సాగిపోయారు.. -
మద్యం పై యుద్ధం
సాక్షి, బాపట్ల : ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన భర్త తూలుతూ వస్తాడు.. నాన్న వస్తే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు అడుగుదామని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్న కూతురికి తన తండ్రి నోటివెంట వచ్చే మద్యం వాసన గుప్పుమంటుంది. ప్రెండ్స్‌తో పార్టీలో ఉన్నానని భర్త ఫోన్ చేసి చెబుతాడు. కళాశాలకు వెళ్లే కుర్రాడి గదిలో బీరుబాటిల్స్ దర్శనమిస్తుంటాయి. నెలఖర్చులు జమచేసేందుకు జీతం డబ్బులు లెక్కేస్తే మిగిలినవి కనిపించని పరిస్థితి. రోజంతా కాయాకష్టంచేసి ఉన్నదంతా మద్యానికి తగలేసి ఇంటిల్లిపాదీ పస్తులు పెట్టే మహానుభావులు కూడా ఎందరో... కుటుంబాలను ఎంతో నాశనం చేస్తున్న ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే కారణం మద్యం. దురలవాటుల వల్ల మాత్రమే ఈ నష్టాలకు కారణం అనుకుందామనుకుంటే.. ప్రభుత్వం మరో కారణంగా ఉండడం బాధాకరం. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న ఆర్థిక సూత్రాన్ని తరతరాలుగా పాలకులు ఫాలో అవుతున్నారు. ఎన్నికలకు మందు గ్రామానికి ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియమిస్తాం.. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చూస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు తాగునీటికన్నా కూడా మద్యమే అందుబాటులో ఉండేలా వీధికొకషాపు చొప్పున ఏర్పాటు చేయించారు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని నవరత్న పథకాల్లో ప్రకటించారు. అది ఎలా నిషేధిస్తారో కూడా ప్రణాళికను ప్రజల ముందు ఉంచారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణం, మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో 22 మద్యం దుకాణాలు 4 బార్లు ఉన్నాయి. సుమారు నియోజకవర్గంలో 50కు పైగా అనధికారికంగా బెల్టుషాపులు ఉంటాయని మహిళలు అరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో పర్యటించినప్పుడు మహిళల బాధలు నేరుగా చూశారు. బరువెక్కిన హృదయాలతో వారు చెప్పిన మాటలు విని చలించిపోయారు. ఇళ్ల మధ్యనే మద్య దుకాణాలు ఉండడంతో చిన్నపిల్లలు సైతం వెసనపరులుగా మారుతున్నారంటూ జననేత వద్ద మహిళలు అవేదన చెందారు. మద్యపాన నిషేధానికి పెద్దపీట మద్యం ఎంతగా పేదల కుటుంబాలను కుంగతీస్తుందో కళ్లారా చూసిన జగన్ నవరత్నాల్లో మద్యపాన నిషేధానికి పెద్దపీట వేశారు. ఐదేళ్లల్లో శాస్త్రీయ పద్ధతిలో దశలవారీగా మద్యం నిషేధిస్తామంటూ పార్టీ జాతీయ ప్లీనరీలో ప్రకటన చేశారు. ఉత్తుత్తి హామీ కాకుండా నిషేధం ఏ పద్ధతిలో చేస్తానో కూడా వివరించడంతో జగన్మోహన్రెడ్డిపై మహిళలకు నమ్మకం కలిగింది. దేవుని దయవలన ప్రజలందరి ఆదరణ వల్ల ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనలో మద్య విక్రయాలను ఏడాదికాఏడాది తగ్గిస్తూ మద్యం మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రణాళికను రూపొందించారు. దీంతో కారుచీకట్లో కాంతిపుంజంలా మహిళలకు జగన్మోహన్రెడ్డిపై అభిమానం పెరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి మద్యాన్ని నిషేధిస్తే సామాన్య కుటుంబాలు ఎన్నో బాగుపడుతాయంటూ ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. తప్పక నెరవేరుస్తారనే విశ్వాసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగటానికి నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవడం లేదు. కానీ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు పెట్టి ఖజానా నింపుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. సంపాదించిన సొమ్మంతా మగవారు తాగుడుకే తగలేయడంతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. జగనన్న ప్రకటించిన మద్యపాన నిషేధ హామీ తప్పక నేరవేరుస్తారని విశ్వాసం ఉంది. – కొండా అన్నమ్మ రాజన్న బిడ్డ.. మాట నిలబెట్టుకుంటాడు తెలుగు ప్రజల దైవం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటాడన్నా విశ్వాసం మాలో ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలన చూసిన తర్వాత జగనన్నకు ఓ అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచన ప్రజలందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేధిస్తామని నవరత్నాల్లో ప్రకటించడం మహిళల్లో భరోసా నింపుతుంది. –షేక్ ఫాతిమా -
ముందస్తు బెయిల్‌కు మనోరమాదేవి పిటిషన్
బిహార్: సస్పెన్షన్‌కు గురైన జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి శుక్రవారం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. బిహార్‌లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని అతిక్రమించడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన జిల్లా కోర్టు... దీనిపై సోమవారం విచారణ జరపనుంది. కాగా మనోరమా దేవి కొద్దిరోజులగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మనోరమా దేవి లొంగిపోకుంటే... ఆమె ఆస్తులను సీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మనోరమా దేవి నివాసంలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను పరీక్షల నిమిత్తం పాట్నాలోని ల్యాబ్‌కు పంపించనున్నారు. కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్... తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడనే నెపంతో ఓ యువకుడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈకేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. -
మద్య నిషేధం
మద్య నిషేధాన్ని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపడుతు న్నట్టు సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ప్రకటించడం హర్షణీయం. మద్యం కారణంగా కలిగే దుష్పరి ణామా లు దారుణంగా ఉంటాయి. ఒకవేళ మద్యాన్ని అరికట్టినా, కల్తీ మద్యం పుణ్య మా అని వేలాది మంది చనిపోతున్నారు. లేదా రోగాల బారిన పడి ఆస్పత్రులకు చేరుతున్నారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే ప్రోత్సహించడం సరికాదు. మద్యపానాన్ని ఎందుకు నిషేధించరాదో తెలుపాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతా లకు నోటీసులు ఇచ్చింది. ఎప్పుడో ఇచ్చిన ఆ నోటీసులకు ఇంతవరకు జవాబు లేదు. విలువల గురించి మాట్లాడే ఎన్డీఏ ప్రభు త్వం అయినా సుప్రీంకోర్టుకు బాసటగా నిలవాలి. - పి. గంగునాయుడు, శ్రీకాకుళం -
కృష్ణాపురంలో మద్యం నిషేధం
పొండూరు(శ్రీకాకుళం): కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం రక్కసిపై ఓ గ్రామస్తులు పోరుకు దిగారు. కొత్త మద్యం పాలసీలకు తెలుగు రాష్ట్రాల పాలకులు కసరత్తులు ప్రారంభించనప్పటికీ ఆ గ్రామస్తులు మాత్రం మద్యం రక్కసిని రూపు మాపుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొండూరు మండలం కృష్ణాపురం గ్రామంలో మద్యానికై బానిసై కొంతమంది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు ఇకనుంచి గ్రామంలో మద్యాన్ని నిషేధిస్తూ ఆదివారం తీర్మానం చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. -
'కేరళ బార్లకు సెప్టెంబర్ 12న లాస్ట్బెల్'
తిరువనంతపురం: కేరళ మందుబాబులకు ప్రభుత్వం చేదు వార్త అందించింది. సెప్టెంబర్ 12 నుంచి మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించనున్నట్టు ఊమెన్ చాందీ సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 730 బార్లలో 418 బార్ల లైసెన్సులు పునరుద్దరించలేదని ఎక్సైజ్ మంత్రి కె. బాబు తెలిపారు. మిగిలిన 312 బార్లు, 20 స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలను వచ్చే నెల 12 నుంచి నిషేధించనున్నట్టు ప్రకటించారు. వీటికి 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. పదేళ్లలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము చేపట్టబోయే కొత్త ఎక్సైజ్ విధానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై నిర్ణయాన్ని కోర్టు సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.