బిహార్‌లో మద్యపాన నిషేధంపై అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం పూర్తిస్థాయిలో విజయవంతం అవ్వలేదని జనతాదళ్ యూనైటెడ్ పార్టమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుశ్వాహ ఆరోపించారు. రాష్ట్రంలో అక్కడక్కడా మద్యపానం జరుగుతోందని, దీని ద్వారా నేరాల సంఖ్య పేరుగుతోందని పేర్కొన్నారు. కాగా సొంత ప్రభుత్వంపై జేడీయూ నేత విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కుశ్వాహా వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి.
ఈ సందర్భంగా జేడీయూ నేత మాట్లాడుతూ.. లిక్కర్ అమ్మకాలను ఆపేస్తే మద్యం సేవించడం ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోందని.. కేవలం ప్రభుత్వం అమ్మకాలు ఆపేసినంత మాత్రాన సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప మద్యం నిషేధం విజయవంతం అవ్వదన్నారు. బిహార్‌లో చట్టాల ద్వారా ప్రభుత్వం మద్యపాన విక్రయాన్ని మాత్రమే ఆపగలిగింది కానీ, మద్యపాన సేవనాన్ని నిరోధించలేకపోయిందని విమర్శించారు.
చదవండి: ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే..
అమ్మకానికంటే ముందు తాగడం మాన్పించాలని సూచించారు. బిహార్‌లో మద్యనిషేధంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతం కాలేదు. పలుచోట్ల మద్యం వినియోగిస్తున్నారు. దొంగచాటు విక్రయాల వల్ల నేరాలు పెరుతున్నాయని. నిషేధాన్ని మరింత కఠినంగా ఆమలు చేస్తే నేరాలు తగ్గి సమాజం మరింత బాగుపడుతంది’ అని కుశ్వాహ అన్నారు.
అయితే జేడీయూ నేత వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. ఉపేంద్ర కుష్వాహ నితీష్ కుమార్ కంటే నిజాయితీగల సోషలిస్టు అని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ పేర్కొన్నారు. మద్యపాన నిషేధం విఫలమవ్వడం కారణంగా రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment