Upendra Kushwaha
-
జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ
పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా దళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్ మహాఘఠ్‌బంధన్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు లభిస్తున్న ప్రాముఖ్యంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహ గత కొంత కాలంగా జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజీనామాపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ స్పందించారు. ‘జేడీయూ నుంచి వెళ్లిపోయి సొంతంగా రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ పెట్టుకున్న కుష్వాహను 2021లో తిరిగి పార్టీలోకి కేవలం సీఎం నితీశ్ కుమార్ జోక్యంతోనే తీసుకున్నాం. స్థాయికి మించిన ఆశలు ఆయనకున్నాయి. అందుకే వెళ్లిపోతున్నారు’అని పేర్కొన్నారు. -
బీహార్‌లో సీఎం నితీష్‌కు షాక్.. హ్యాండిచ్చిన కుష్వాహా
పాట్నా: బీహార్ రాజకీయం హీటెక్కింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. సీఎం నితీష్‌తో విబేధాల కారణంగా జనతాదళ్(యునైటెడ్)కి ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్పర్సన్ ఉపేంద్ర కుష్వాహా వీడ్కోలు చెప్పారు. జేడీయూకు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇదే సమయంలో బీహార్ సీఎంపై సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఈ సందర్బంగా ఉపేంద్ర కుష్వాహా మీడియాతో మాట్లాడుతూ..‘మేము కొత్త పార్టీ.. రాష్ట్రీయ లోక్ జనతా దళ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. కొత్త పార్టీకి నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటాను. కర్పూరి ఠాకూర వారసత్వాన్ని తమ పార్టీ ముందుకు తీసుకువెళుతుందని తెలిపారు. సీఎం నితీష్ కుమార్ వైఖరి పట్ల కొద్ది మంది మినహా.. జేడీయూలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో బీహార్ కోసం నితీష్ కుమార్ మంచి చేశారు. కానీ.. ఇప్పుడు అతడి నిర్ణయాలు బీహార్ ప్రజలకు అనుకూలంగా లేవు. సీఎం నితీష్ తన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు(పరోక్షంగా తేజస్వీ యాదవ్‌పై విమర్శలు) అని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిని తయారు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఈ కారణంగానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా పాట్నాలో సమావేశాలు, చర్చలు జరిగాయి. మాకు మద్దతుగా ఉన్న నేతలు కూడా ఏకగ్రీవంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే కొత్త పార్టీతో ముందుకు సాగుతాము. ఇదే క్రమంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కుష్వాహా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అంతుకు ముందు 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్‌కు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ఇటీవల నితీశ్ చేసిన ప్రకటన కూడా ఉపేంద్ర అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కుష్వాహా పలుసార్లు తమ కూటమిలోకి రావడం, వెళ్లడం పట్ల నితీశ్‌కుమార్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన జేడీయూని వీడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కుష్వాహా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
సొంత ప్రభుత్వంపై జేడీయూ నేత సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో సీఎం!
బిహార్‌లో మద్యపాన నిషేధంపై అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధ చట్టం పూర్తిస్థాయిలో విజయవంతం అవ్వలేదని జనతాదళ్ యూనైటెడ్ పార్టమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుశ్వాహ ఆరోపించారు. రాష్ట్రంలో అక్కడక్కడా మద్యపానం జరుగుతోందని, దీని ద్వారా నేరాల సంఖ్య పేరుగుతోందని పేర్కొన్నారు. కాగా సొంత ప్రభుత్వంపై జేడీయూ నేత విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కుశ్వాహా వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా జేడీయూ నేత మాట్లాడుతూ.. లిక్కర్ అమ్మకాలను ఆపేస్తే మద్యం సేవించడం ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోందని.. కేవలం ప్రభుత్వం అమ్మకాలు ఆపేసినంత మాత్రాన సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప మద్యం నిషేధం విజయవంతం అవ్వదన్నారు. బిహార్‌లో చట్టాల ద్వారా ప్రభుత్వం మద్యపాన విక్రయాన్ని మాత్రమే ఆపగలిగింది కానీ, మద్యపాన సేవనాన్ని నిరోధించలేకపోయిందని విమర్శించారు. చదవండి: ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే.. అమ్మకానికంటే ముందు తాగడం మాన్పించాలని సూచించారు. బిహార్‌లో మద్యనిషేధంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతం కాలేదు. పలుచోట్ల మద్యం వినియోగిస్తున్నారు. దొంగచాటు విక్రయాల వల్ల నేరాలు పెరుతున్నాయని. నిషేధాన్ని మరింత కఠినంగా ఆమలు చేస్తే నేరాలు తగ్గి సమాజం మరింత బాగుపడుతంది’ అని కుశ్వాహ అన్నారు. అయితే జేడీయూ నేత వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. ఉపేంద్ర కుష్వాహ నితీష్ కుమార్ కంటే నిజాయితీగల సోషలిస్టు అని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ పేర్కొన్నారు. మద్యపాన నిషేధం విఫలమవ్వడం కారణంగా రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. -
బిహార్ ఎన్నికలు; కీలక పరిణామం
పట్నా: రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని.. ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలోని కూటమికి సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ ప్రకటించారు. ఈ ఫ్రంట్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందని కుష్వాహ చెప్పారు. గత పదిహేనేళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన నితీష్ కుమార్, అంతకు ముందు దశాబ్దంన్నర పాటు రాష్ట్రాన్ని ఏలిన లాలూ ప్రసాద్, రబ్రీదేవి పాలనలను ఒకే నాణేనికి ఇరువైపుల ఉన్న బొమ్మా బొరుసుగా ఆయన పేర్కొన్నారు. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బరిలోకి దిగుతోంది. (చదవండి: ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే) -
బిహార్‌లో మహాకూటమికి షాక్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ ఇప్పటికే తేల్చిచెప్పారు. కాగా బీఎస్పీతో కలిసి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్ మాజీ సీఎం నితిన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు.మహాకూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్‌గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక పట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిన్న పార్టీలతో చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆర్ఎల్ఎస్పీ వర్గాలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు! -
‘ఆయన చేతిలో మోసపోని వారు ఎవరు లేరు’
పట్నా : బీజేపీ జాగ్రత్తగా ఉండాలని.. త్వరలోనే ఆ పార్టీకి ద్రోహం జరగబోతుందని హెచ్చరించారు రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ. ఈ క్రమంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ త్వరలోనే దోఖా నం. 2గా మారబోతున్నారు. ఆయన బీజేపీని మోసం చేస్తారు. ప్రజల ఆదేశాన్ని, కూటమి సభ్యులను మోసం చేయడం నితీష్ కుమార్‌కు కొత్తేం కాదు. నితీష్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సామెత బీజేపీకి వర్తిస్తుంది. త్వరలోనే అతను ఎన్డీఏ కూటమికి ద్రోహం చేస్తాడు’ అని ఉపేంద్ర కుష్వాహ హెచ్చరించారు. గతంలో మేం నితీష్ చేతిలో మోసపోయాం. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం అని తెలిపారు. -
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
యూపీఏలోకి ఆర్ఎల్ఎస్పీ
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర మంత్రి పదవిని వదులుకుని ఎన్డీయే నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర కుష్వాహ గురువారం యూపీఏతో చేతులు కలిపారు. బిహార్‌లో తమ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రతిపక్షాల మహాకూటమిలో చేరిందని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, ఏఐసీసీ బిహార్ ఇన్ చార్జ్ శక్తిసింహ్ గోహిల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర ప్రతిపక్ష నేతలు శరద్ యాదవ్, జతిన్ రాం మాంఝీ తదితరుల సమక్షంలో కుష్వాహ ఈ ప్రకటన చేశారు. కుష్వాహను మహాకూటమిలోకి ఆహ్వానించిన పై నేతలు.. తామంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే తాను ఎన్డీయే నుంచి బయటకొచ్చాననీ, అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పార్టీని అవమానిస్తున్నా మోదీ మౌనం వహించడం తనను బాధించిందని కుష్వాహ చెప్పారు. ప్రమాదంలో బీజేపీ–ఎల్జేపీ బంధం! బిహార్‌లో ఇప్పటికే ఆర్ఎల్ఎస్పీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయగా తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. -
బీజేపీకి మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, హిందూస్తాన్ అవామ్ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్ స్వాగతించారు. ‘బిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్ జనశక్తి(ఎల్జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్ పాశ్వాన్ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు. -
‘త్వరలోనే ఎన్డీయేకు మరోపార్టీ గుడ్‌బై’
పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ అహంకారం కారణంగానే తాను ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చానని రాష్ట్రీయ లోక్సమాత పార్టీ (ఆర్ఎస్ఎల్పీ) అధినేత, మాజీ కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. ఎన్డీయే నేతల మధ్య ఏకభిప్రాయంలేదని, త్వరలోనే లోక్‌జన శక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా బీజేపికు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్డీయే కూటమి నుంచి ఉపేంద్ర బయటకు వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కుష్వాహా బుధవారం పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో కొత్తగా చేరిన నితీష్ వ్యవహారంతోనే తాను బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎల్జేపీ కూడా అసంతృప్తితో ఉందని, రాంవిలాస్ పాశ్వాన్ కూడా బయటకు త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. కాగా నితీష్, అమిత్‌షా మధ్య లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు చర్చలతో బిహార్ ఎన్డీయే కూటమిలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. ఎల్జేపీ కూడా గుడ్‌బై చెప్పితే బిహార్‌లో బీజేపీకి పెద్ద నష్టమే జరుగుతుందని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
కుష్వాహాకు తిరుగుబాటు సెగ
పట్నా: రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి కుష్వాహా బయటకు వెళ్లిపోయినా, తాము కూటమిలోనే ఉంటామని బిహార్ ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యేలు సుధాంశు శేఖర్, లలన్ పాశ్వాన్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్ శ్యామ్ చెప్పారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే కుష్వాహా ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. ఆర్ఎల్ఎస్పీలో మెజారిటీ ఆఫీస్‌బేరర్ల మద్దతు తమకే ఉందన్నారు. ఆల్ఎల్ఎస్పీ ఎన్నికల గుర్తు విషయమై త్వరలోనే ఈసీని కలుస్తామని తెలిపారు. ఆర్ఎల్ఎస్పీకి బిహార్‌లో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. -
ఎన్డీఏకు కుష్వాహా గుడ్‌బై
న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అధికార ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రిగా ఉన్న కుష్వాహా సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. మంత్రి వర్గాన్ని ప్రధాని మోదీ రబ్బర్ స్టాంపుగా మార్చేశారనీ, వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. తమ పార్టీ బిహార్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఊహించిన పరిణామమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు కుష్వాహా ఎన్డీఏ నుంచి వైదొలుగుతారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సోమవారం కుష్వాహా తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్లక్ష్యానికి, మోసానికి గురైనట్లు భావిస్తున్నా. పేదల సంక్షేమం కోసం పనిచేయడం మాని, రాజకీయ విరోధులను అణచి వేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఎన్డీఏకు దక్కదు’ అని అందులో పేర్కొన్నారు. ఆర్ఎల్ఎస్పీకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఎమ్మెల్యేలిద్దరూ పార్టీని వీడారు. కుష్వాహా ప్రభావం ఎంత? కుష్వాహా చేసిన రాజీనామా ఉత్తరప్రదేశ్, బిహార్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కోయిరీ(కుష్వాహా) కులానికి చెందిన నేత కుష్వాహా. బీసీ వర్గమైన కోయిరీలు ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. బిహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలో ఆర్ఎల్ఎస్పీ చేరి, తర్వాత బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమిలో చేరితే హిందీ ప్రాంతాల్లోని కోయిరీలపై ఎంత వరకు ప్రభావం ఉంటుందో చెప్పడం కష్టం. అదే బాటలో మరో పార్టీ! ఎన్డీఏలోని మరో పక్షం అసోం గణపరిషత్ (ఏజీపీ) నడిచే అవకాశముంది. పౌరసత్వ సవ రణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే ఎన్డీఏ నుంచి వైదొలుగుతామంటూ హెచ్చరించింది. -
కేంద్ర మంత్రి కుష్వాహా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. కుష్వాహా తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) ఆమోదం కొరకు పంపినట్టు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ సీట్ల సర్ధుబాటు ప్రతిపాదనలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరితో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకు రావాలని ఇటీవల జరిగిన ఆర్ఎల్ఎస్పీ మేధోమధన భేటీలో ఆ పార్టీ నిర్ణయించింది. కాగా సోమవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తాను హాజరు కాబోనని కుష్వాహా ప్రకటించారు. ఈనెల 12న పార్టీ నేతల కీలక భేటీలో ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై ఆర్ఎల్ఎస్పీ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కాగా,ఎన్డీఏ వ్యవహారాలపై సంప్రదించేందుకు తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల సమయం కోరినా తనకు అపాయింట్మెంట్ నిరాకరించారని గతంలో కుష్వాహా అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్‌లో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో ఆ పార్టీ చేరవచ్చని తెలుస్తోంది. -
బిహార్‌లో ఎన్డీఏకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, రాష్ర్టీయ లోక్‌సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుష్వాహా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి గురువారం వైదొలగనున్నారని భావిస్తున్నారు. మంగళవారం ఆర్ఎల్ఎస్పీ నేతల చింతన్ శిబిర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోతిహరీలో జరిగే బహిరంగ సభలో బీజేపీతో దోస్తీకి స్వస్తి పలికే నిర్ణయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటిస్తారని చెబుతున్నారు. తాను బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల అపాయింట్మెంట్ కోరినా లభించలేదని గత కొంతకాలంగా కుష్వాహా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారు తనకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలీదని, వారు అంత బిజీగా ఉంటే కనీసం ఫోన్ అయినా చేయవచ్చని గతంలో ఆర్ఎల్ఎస్పీ చీఫ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌పైనా కుష్వాహా గత నెలలో నిప్పులు చెరిగారు. నితీష్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేశారని ఆరోపించారు. కాగా, కుష్వాహా ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్‌తో కుష్వాహా భేటీ ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. -
చీలిక దిశగా ఎన్డీయే..!
పట్నా : చీలిక దిశగా బిహార్‌లో ఎన్డీయే కూటమి మలుపులు తిరుగుతోంది. లోక్‌సభ సీట్ల పంపకంతో మొదలైన వీరి విభేదాలు సొంత కూటమిలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు చేరింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్రమంత్రి ఉపేందర్ కుష్వాహా సోమవారం శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. వారి భేటీ బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో శరద్‌ను కలిసిన ఉపేంద్ర రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు సమాచారం. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన లోక్‌సభ సీట్ల పంపిణీపై భాగస్వాయ్య పార్టీలైన ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో సరైన ప్రాతినిథ్యం లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఎల్ఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలపై ఉపేంద్ర స్పందించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరగా చూపి జేడీయూలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు చీల్చడంలో నితీష్ ఘనుడని ఆయనపై మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో ఎన్డీయేలో విభేదాలన్నింటికీ మూలకారణం సీట్ల పంపకమేనని కూటమిని నేతలు భావిస్తున్నారు. మిత్ర పక్షాలను సంప్రధించకుండా బీజేపీ, జేడీయూ లోక్‌సభ సీట్లలో 20-20 చొప్పున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని ఎల్జేపీ నేతలు అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అవుతామని ఎల్జేపీ నేత కేంద్రమంత్రి, రామ్‌విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. కాగా 40 లోక్‌సభ స్థానాలు గల బిహార్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 20, ఎల్జేపీ ఏడు, ఆర్ఎల్ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ కేవలం రెండుస్థానాలకే పరితమైంది. బీజేపీకి షాకివ్వనున్న మిత్రపక్షాలు! -
పార్టీల్ని చీల్చడంలో నితీశ్ ఘనుడు: కుష్వాహా
పట్నా: బిహార్‌లో ఎన్డీయే మిత్ర పక్షాలు జేడీ(యూ), ఆర్ఎల్ఎస్పీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ఫిర్యాదుచేస్తానని కుష్వాహా తెలిపారు. పార్టీలను చీల్చడంలో నితీశ్ ఆరితేరారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్‌లో సీట్ల పంపకంపై త్వరగా స్పష్టత ఇవ్వాలని షాపై ఒత్తిడితెస్తానని చెప్పారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను కలుసుకున్న తరువాత ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే సుధాంశు శేఖర్ పార్టీ మారబోతున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కుష్వాహా పైవిధంగా స్పందించారు. మరో ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ కూడా జేడీయూలో చేరే అవకాశాలున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. -
నితీష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ చీఫ్ అమిత్ షా తక్షణం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కుష్వాహ డిమాండ్ చేశారు. బిహార్ సీఎం చేసిన వ్యాఖ్యల అంతరార్ధంపై నిగ్గుతేల్చేందుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం అధిపతిగా అమిత్ షా జోక్యం చేసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 2020 తర్వాత సీఎంగా కొనసాగేందుకు నితీష్ కుమార్ సుముఖంగా లేరన్న కుష్వాహ వ్యాఖ్యలపై నితీష్ స్పందించిన తీరును ఆయన తప్పుపడుతున్నారు. చర్చను దిగజార్చే స్ధాయికి తీసుకొచ్చేందుకు అనుమతించమని నితీష్ వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గెలిపించేందుకు కొన్ని ఎన్డీఏ పక్షాలు ఆసక్తికనబరచడం లేదన్న కుష్వాహ వ్యాఖ్యలతో జేడీ(యూ) చీఫ్‌కు, ఆర్ఎల్ఎస్పీ అధినేతకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నానని కుష్వాహ చెప్పుకొచ్చారు. తనపై బీజేపీ అధిష్టానానికి విష ప్రచారానికి పాల్పడుతున్న వారి ఏలుబడిలో బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. -
‘మళ్లీ ఆయన సీఎంగా ఉండాలనుకోవడం లేదు’
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘2020 ఎన్నికల్లో బిహార్ ప్రజలు మరోసారి జేడీయూకి అధికారం ఇవ్వకపోవచ్చు. అందుకే తాను మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని నితీష్ అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితీషే కొన్ని నెలల క్రితం తనతో చెప్పాడు’ అని ఉపేంద్ర వెల్లడించారు. (మళ్లీ ఆయనే సీఎం: సర్వే) 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మరో దఫా ఓటు వేసి గెలిపించక పోవచ్చునని నితీష్ తన మనసులో మాట బయటపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. నితీష్‌కుమార్, జేడీయూపై నేను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావని అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉపేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ భవిష్యత్‌పై ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు కామెంట్లు చేయడంతో రాజకీయంగా ప్రాదాన్యత సంతరించుకుంది. (జేడీయూతో దోస్తి.. దిగొచ్చిన బీజేపీ) కాగా, ఎన్డీయే కూటమిలో తిరిగి చేరిన జేడీయూకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని సీట్లు త్యాగం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశాడు. క్రితం సారి ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి మూడు ఎంపీ స్థానాలు కేటాయించిన బీజేపీ ఈ సారి ఆ సంఖ్యను రెండుకు కుదించింది. ఈ నేపథ్యంలోనే అసహనంతో ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..పటేల్ జయంతి సభకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌తో ఉపేంద్ర భేటీ అయ్యారు. అయితే, స్నేహపూర్వక భేటీలో భాగంగానే తేజస్వీని కలిసినట్టు ఉపేంద్ర వెల్లడించారు. -
‘నేను గిల్లీదండ బాగా ఆడతాను’
పాట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో పొత్తుల చర్చలు ఊపందుకుంటున్నాయి. బీజేపీ, జేడీ(యూ), ఆర్ఎల్ఎస్పీ పార్టీల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రూపం దాల్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషాహ ‘మా పార్టీలో జరిగే విషయాల గురించి మా కంటే ముందు మీకే తెలుస్తున్నాయి. సీట్ల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయం గురించి పార్టీల్లో కన్నా మీడియాలోనే ఎక్కువ చర్చ జరుగుతుంది’ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బిహార్‌లో బీజేపీ 20 - 20 ఫార్మాట్‌ని పాటించబోతుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ సీట్లలో 20 సీట్లు బీజేపీకి, మిగిలిన 20 సీట్లలో 12 నితిష్ కుమార్ జేడీ(యూ)కి మరో 6 రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీకి కేటాయించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీని గురించి ఉపేంద్రను ప్రశ్నించగా ఆయన నేను కాస్తా పాత తరం వాడిని.. అందుకే నాకు ఈ 20 - 20 ఫార్మాట్ గురించి పూర్తిగా తేలీదు.. అర్థం కూడా కాదు. కానీ నేను గిల్లీ దండ మాత్రం చాలా బాగా ఆడతానంటూ వెరైటీగా స్పందించారు. అంతే కాకుండా సీట్ల పంపిణీ గురించి సదరు పార్టీల్లోకన్నా మీ చానెల్స్‌లోనే ఎక్కువ చర్చ జరుగుతుందన్నారు. వ్యక్తిగతంగా అయితే తనకు సీట్ల పంపకం నచ్చదన్నారు. కానీ పార్టీ నుంచి నిర్ణయం వెలువడే వరకూ తాను ఈ విషయం గురించి ఏం మాట్లడనన్నారు. -
సెప్టెంబరు 25 నుంచి ఖీర్ ఉద్యమం!!
పట్నా : ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన కొంత మంది వ్యక్తులకు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఇష్టం లేదని కేంద్ర మంత్రి, ఆరెస్‌ఎల్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల దృష్ట్యా పొత్తు విషయమై బిహార్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య లోక్‌సభ సీట్ల పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన 20- 20 ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. జేడీయూకు 12, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) 7 చోట్ల, ఉపేంద్ర కుశ్వాహ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)కి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదిరింది. కుశ్వాహతో విభేదిస్తున్న ఎంపీ అరుణ్ కుమార్‌కు ఒక స్థానాన్ని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితోనే కుశ్వాహ ఎన్డీయే సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఖీర్ సిద్ధాంతం... ఓ సామాజిక ఉద్యమం.. మోదీ నాయకత్వాన్ని నిలబెట్టేందుకు పైగమ్- ఏ- ఖీర్ పేరిట సెప్టెంబరు 25 నుంచి సామాజిక ఉద్యమం చేపడుతున్నామని కుశ్వాహ తెలిపారు. బ్రాహ్మణుల దగ్గర నుంచి చక్కెర, చౌదరీల నుంచి తులసి, వెనుకబడిన తరగతులు, దళితులు, ముస్లింల నుంచి డ్రై ఫ్రూట్స్ సేకరించి రుచికరమైన ఖీర్(పాయసం) తయారు చేస్తామని పేర్కొన్నారు. అందరూ సమానమనే భావన కల్పించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఖీర్ విందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. -
సుప్రీం అంటే దళితులకు భయం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నివారణ చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడం, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన జడ్జీలకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల వెల్లువెత్తిన నిరసనలు సుప్రీంకోర్టు అంటే దళితుల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఎగువ న్యాయ వ్యవస్థలో దళితులు, పేదలకు న్యాయబద్ధ ప్రాతినిధ్యం దక్కేలా ఆయన పార్టీ, ఎన్డీయే భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గురువారం ‘హల్లా బోల్, దర్వాజా ఖోల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థే మూల స్తంభం లాంటిదని, కానీ న్యాయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపించారు. ‘టీ అమ్మే వ్యక్తి ప్రధాని కావొచ్చు. దినసరి కూలీ బిడ్డ ఐఏఎస్ అధికారి కావొచ్చు. పేద కుటుంబాల నుంచి ఎంత మంది జడ్జీలు వచ్చారో సుప్రీంకోర్టు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కోరారు. -
కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’ వెల్లడి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్స్ మెకానిక్స్, డ్రైవర్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్ష ‘కీ’ని ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోగా తమ అభ్యంతరాలు తెలపాలని కోరింది. విజయవాడ, విశాఖ కేంద్రాలుగా ‘నీట్’ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2017ను ఏపీలో విజయవాడ, విశాఖ కేంద్రాలుగా నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ తెలిపారు. జేఈఈ మెయిన్స్–2017ను తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే జేఈఈ అడ్వాన్స్–2017ను అనంతపురం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ మురళీమోహన్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు. -
‘నవోదయా’ల్లో త్వరలో ఓబీసీలకు కోటా!
న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్వీ) ఓబీసీ విద్యార్థులకు కోటా కల్పించకలేకపోవడం పట్ల ఆ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా విస్మయం వ్యక్తంచేశారు. సమీప భవిష్యత్తులో దీనికి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 600 జేఎన్‌వీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపవుట్ల రేటెంతో తెలుసా?
యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూ-డీఐసీఈ) ప్రకారం 2015-16లో ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిలో సగటు వార్షిక డ్రాపవుట్ రేటు 4.10 శాతం, 17.06శాతంగా ఉన్నాయని మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. ఈ డ్రాపవుట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో 6.18 శాతం, మాధ్యమిక స్థాయిలో 15.71శాతంగా ఉన్నట్టు చెప్పారు. 2015-16లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పాఠశాల మూత పడలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 37శాతానికి పెరిగిన స్కూల్ డ్రాపవుట్లపై ప్రశ్నోత్తరాల సదర్భంగా వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ మేరకు వివరాలను లిఖిత పూర్వకంగా అందించారు. పాఠశాల ప్రారంభం, మూత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనపై ఆధారపడి ఉంటాయని ఉపేంద్ర కుష్వాహా స్పష్టీకరించారు. సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సార్వజనీకరణ ప్రాథమిక విద్యను అందించే విషయంలో మాత్రం తాము హామీని ఇవ్వగలమన్నారు. ప్రాథమిక విద్యను అందించడానికి 2016 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,156 కొత్త ప్రాథమిక పాఠశాలలు, 4,256 కొత్త ప్రాథమికోన్నత పాఠశాలు, 69,706 అదనపు తరగతి గదులను మంజూరు చేసినట్టు వెల్లడించారు. అదనంగా 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను కూడా మంజూరు చేసినట్టు చెప్పారు. పాఠశాలలు ఏర్పాటుచేయడానికి అవసరమైన భూమి లేని ప్రాంతాల పిల్లలకు ఎస్ఎస్ఏ కింద గురుకుల పాఠశాలలు/వసతి గృహాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్ అవుతున్న పిల్లలకు, మురికివాడల్లో నివసించే పిల్లలకు, బాలవర్కర్లకు తాము ప్రత్యేక శిక్షణ ఇచ్చి, పాఠశాలల్లో చేర్పిస్తున్నామన్నారు. -
విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడండి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి 2016-17 విద్యా సంవత్సరానికిగాను మొత్తం 60 దరఖాస్తులను సీబీఎస్ఈ స్వీకరించిందని కేంద్ర మానవ అభివద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా చెప్పారు. ప్రాథమిక ప్రక్రియలో ఏ దరఖాస్తు కూడా పెండింగ్‌లో లేదని, అయితే, బై-చట్టాలకు అనుగుణంగా నిబంధనలు పాటించని పాఠశాలల దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సీబీఎస్ఈకి వచ్చిన స్కూల్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించడానికి సీబీఎస్ఈ ఎలాంటి చర్యలను తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించగా ఈ మేరకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పిల్లలు విద్యనందుకునేలా సాయపడాలని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు సీబీఎస్ఈ చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.