'వందేమాతరం.. బలవంతంగా పాడించరాదు'
వందేమాతరం గేయాన్ని ఎవరితోనూ బలవంతంగా పాడించొద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వాహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 'వందేమాతరం పాడాలన్న నిర్ణయాన్ని ఎవరిపై రుద్దవద్దు, ఎవరిని బలవంత పెట్టవద్దు' అని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్) అధ్యక్షుడు కుశ్వాహ వ్యాఖ్యానించారు.
బిహార్ లోని గోపాల్గంజ్ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వందేమాతరం ఆలాపనపై నిషేంధించడం గురించి విలేకరులు మంత్రిని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. వందేమాతరం ఆలపించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలన్నారు. ఏ చట్టం, నిబంధనలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండవని ఉపేంద్ర కుశ్వాహ ఇటీవలే ప్రస్తాంవించిన విషయం తెలిసిందే.