Rashtriya Lok Samta Party
-
లోక్‌సభ పోరు.. ఫైనల్ పంచ్ ఎవరిదో!
బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి సందీప్ సౌరవ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్ వర్సెస్ లెఫ్ట్ మొదట్లో దీని పేరు షాబాద్. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్) అభ్యర్థి సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్ పారీ్టల వార్ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్.. బీజేపీకి పవన్ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి రాజారాం సింగ్ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్ సింగ్ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్... జేడీయూ వర్సెస్ ఆర్జేడీ ‘రెడ్ కారిడార్’లో అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్ ప్రసాద్ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. బీజేపీకి మరో షాక్ ఇచ్చారు. బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, హిందూస్తాన్ అవామ్ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కుష్వాహా ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇప్పుడు యూపీఏలో భాగస్వాములం. ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించార’ని ఈ సందర్భంగా కుష్వాహా తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ తమతో చేతులు కలపడాన్ని తేజశ్వి యాదవ్ స్వాగతించారు. ‘బిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నాం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమంతా ఈగోలు వదిలిపెట్టాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలోనూ మహాకూటమి ఏర్పాటుకు పని మొదలుపెట్టాల’ని తేజశ్వి పేర్కొన్నారు. కుష్వాహా చేరికతో బిహార్‌లో మహాకూటమి బలం పెరిగింది. బీజేపీ, జనతాదళ్(యూ), లోక్ జనశక్తి భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొవాలని మహాకూటమి భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, జేడీ(యూ) సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్ జనశక్తి(ఎల్జేపీ) కూడా అసంతృప్తితో ఉందని.. రాంవిలాస్ పాశ్వాన్ కూడా త్వరలోనే బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించి కలకలం రేపారు. -
'మా పార్టీ చీఫ్‌ను సీఎం చేయండి'
పాట్నా: బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కూటమిలోని కీలక సభ్యత్వ పార్టీ రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ(ఆర్ఎల్ఎస్ పీ) సోమవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ చీఫ్ ఉపేంద్ర ముఖ్యమంత్రి పదవికి తగిన అర్హుడని, ఆయన సమర్థంగా నడపగలడని చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, వారి కలను నిజం చేసేందుకు ఎన్డీఏ కృషిచేయాలని కోరారు. బీహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగిన వ్యక్తి కుశ్వాహ అని చెప్పారు. -
'వందేమాతరం.. బలవంతంగా పాడించరాదు'
వందేమాతరం గేయాన్ని ఎవరితోనూ బలవంతంగా పాడించొద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వాహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 'వందేమాతరం పాడాలన్న నిర్ణయాన్ని ఎవరిపై రుద్దవద్దు, ఎవరిని బలవంత పెట్టవద్దు' అని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్) అధ్యక్షుడు కుశ్వాహ వ్యాఖ్యానించారు. బిహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వందేమాతరం ఆలాపనపై నిషేంధించడం గురించి విలేకరులు మంత్రిని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. వందేమాతరం ఆలపించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలన్నారు. ఏ చట్టం, నిబంధనలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండవని ఉపేంద్ర కుశ్వాహ ఇటీవలే ప్రస్తాంవించిన విషయం తెలిసిందే.