'మా పార్టీ చీఫ్ను సీఎం చేయండి' | BJP ally wants Upendra Kushwaha as Bihar CM nominee | Sakshi
Sakshi News home page

'మా పార్టీ చీఫ్ను సీఎం చేయండి'

Published Mon, Jun 15 2015 12:51 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

BJP ally wants Upendra Kushwaha as Bihar CM nominee

పాట్నా: బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కూటమిలోని కీలక సభ్యత్వ పార్టీ రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ(ఆర్ఎల్ఎస్ పీ) సోమవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ చీఫ్ ఉపేంద్ర ముఖ్యమంత్రి పదవికి తగిన అర్హుడని, ఆయన సమర్థంగా నడపగలడని చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, వారి కలను నిజం చేసేందుకు ఎన్డీఏ కృషిచేయాలని కోరారు. బీహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ను సమర్థంగా ఎదుర్కోగలిగిన వ్యక్తి కుశ్వాహ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement