నాకు మొహమే లేదు.. నన్నెవరు సీఎంను చేస్తారు? | I neither have a face nor brain, who will make me a CM: Shatrughan Sinha | Sakshi
Sakshi News home page

నాకు మొహమే లేదు.. నన్నెవరు సీఎంను చేస్తారు?

Published Mon, Jul 13 2015 12:40 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

నాకు మొహమే లేదు.. నన్నెవరు సీఎంను చేస్తారు? - Sakshi

నాకు మొహమే లేదు.. నన్నెవరు సీఎంను చేస్తారు?

బెంగళూరు: బీహార్ శాసన మండలి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకుని బీజేపీ ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత, నటుడు శతృఘ్నసిన్హా మాత్రం సాధారణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ విజయం చూసి పొంగిపోవాల్సిన అవసరం లేదని, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని గుర్తు చేశారు. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే మండలి ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని, వాటిని వీటితో పోల్చలేమని చెప్పారు.

ఏదేమైనా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శక్తిమంతమైన నేతలని వారిని తక్కువ అంచనా వేయకూడదని, ఎన్నికల వ్యూహ రచనలో పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తాను బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి వెళతానా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన  'నాకు మొహం లేదు... తలకాయ లేదు' అలాంటప్పుడు తననెవరు సీఎంగా చేస్తారని సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement