శత్రుఘ్న.. 'ఖామోష్'గా ఉండు!! | Khamosh, Says Banner Against Shatrughan Sinha, Courtesy BJP Youth Wing | Sakshi
Sakshi News home page

శత్రుఘ్న.. 'ఖామోష్'గా ఉండు!!

Published Thu, Feb 4 2016 6:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

శత్రుఘ్న.. 'ఖామోష్'గా ఉండు!! - Sakshi

శత్రుఘ్న.. 'ఖామోష్'గా ఉండు!!

పట్నా: పార్టీని చిక్కుల్లో పడేయటంలో ఎప్పూడు ముందుండే బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్న సిన్హా 'నోరు మూయించాలంటూ' బిహార్ రాజధాని పట్నాలో ఓ భారీ పోస్టర్ వెలిసింది. బీజేపీ యువమోర్చా ఈ పోస్టర్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. 'ఖామోష్' పేరిట నిలబెట్టిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో అయిన శత్రుఘ్న తన సినిమాల్లో 'ఖామోష్' అనే  ఊతపదాన్ని తరచూ వాడేవారు. ఆయన తాజాగా తీసుకొచ్చిన తన జీవిత కథకు కూడా 'ఎనిథింగ్ బట్ ఖామోష్' అని పేరు పెట్టారు. అయితే కొంతకాలంగా ఈ షాట్ గన్ మాత్రం బీజేపీ అధినాయకత్వం విషయంలో 'ఖామోష్'గా ఉండటం లేదు. బాహాటంగా పార్టీ పెద్దలను ధిక్కరించే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. బీజేపీని ఇబ్బందిపెట్టే ఏ అంశమైనా.. దానిని సమర్థించడంలో ముందుండి.. పార్టీని మరింతగా ఇరకాటంలో పడేస్తున్నారు. గతనెలలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా పబ్లిక్ గా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నను నోరు మూయించాలంటూ బీజేపీ యువమోర్చా ఈ పోస్టర్ పెట్టింది. అంతేకాకుండా ఆయనపై పార్టీ అధినాయకత్వం చర్య తీసుకోవాలని ఈ పోస్టర్ లో కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement