పాట్నా: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా, తనను బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడంపై పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు తనను ప్రచారంలో ఎందుకు పాల్లొనడం లేదని అడగ్గా.. తనను ప్రచారానికి ఎంచుకోలేదని బదులిస్తున్నానని తెలిపారు. తనను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని నాయకత్వానికి తెలిపిన అభద్రత గల బిహార్ ప్రాంతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రజల నమ్మకాన్ని గెలివాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఓ పబ్లిక్ మీటింగ్లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ను పొగడడంతో శత్రుఘ్న సిన్హాను పార్టీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.
'శత్రుఘ్న సిన్హా అసంతృప్తి'
Published Sun, Oct 25 2015 1:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement