నితీశ్‌తో శత్రుఘ్నసిన్హా భేటీ | BJP leader Shatrughan Sinha has met Bihar Chief Minister Nitish Kumar at his residence in Patna | Sakshi
Sakshi News home page

నితీశ్‌తో శత్రుఘ్నసిన్హా భేటీ

Published Mon, Nov 9 2015 3:00 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

నితీశ్‌తో శత్రుఘ్నసిన్హా భేటీ - Sakshi

నితీశ్‌తో శత్రుఘ్నసిన్హా భేటీ

పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా సోమవారం కలిశారు. పట్నాలోని నితీశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది.  అనంతరం శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ తాను బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడా వ్యవహరించలేదని, ఒకవేళ చర్యలు తీసుకుంటే తానేమీ ఆపలేనని అన్నారు. కాగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ను పొగడడంతో శత్రుఘ్న సిన్హాను పార్టీ అధినాయకత్వం బిహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.

 

దీంతో తనను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడంపై ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌తో శత్నుఘ్నసిన్హా  భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement