'పాట్నా దేశ రాజధానిని తలపిస్తోంది' | Nitish Kumar hits out at Modi on DNA remark, says, 'My DNA is the same as that of other people of Bihar' | Sakshi
Sakshi News home page

'పాట్నా దేశ రాజధానిని తలపిస్తోంది'

Published Sun, Aug 30 2015 3:20 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

'పాట్నా దేశ రాజధానిని తలపిస్తోంది' - Sakshi

'పాట్నా దేశ రాజధానిని తలపిస్తోంది'

పాట్నా: బీహార్లో నేరాలు పెరిగిపోయాయని చెప్పడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీపై జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు పాట్నాను చూస్తుంటే దేశ రాజధాని ఢిల్లీ నుంచి తరలి ఇక్కడికే వచ్చిందా అనిపిస్తోందని, ఇటీవల రోజుల్లో ఎవరెవరో మంత్రులు వచ్చి వెళుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతోపాటు, త్వరలో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలిసారి మిత్ర పక్షాలతో జేడీయూ స్వాభిమాన్ పేరిట భారీ సభను పాట్నాలో నిర్వహించింది.

ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, లాలు ప్రసాద్, శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన డీఎన్ఏ విషయంలో విమర్శలు చేసిన మోదీ గురించి మాట్లాడుతూ తమ రాష్ట్రంలోని బీహార్ ప్రజల డీఎన్ఏ ఎలా ఉంటుందో అలాంటి డీఎన్ఏనే తనలోను ఉందని ప్రధానికి చెప్పారు. మోదీ కొత్తగా బీహార్కు రూ.1.25 లక్షల కోట్లు ఇచ్చేదేమీలేదని గతంలో ఇచ్చిన హామీల మేరకు అవి ఇవ్వాల్సినవేనని చెప్పారు.

అధికారంలోకి వచ్చి పదిహేను నెలలవుతున్నా నల్లధనం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తప్పుడు హామీలు తెలియకే గతంలో బీజేపీకి ప్రజలు ఓటేశారని చెప్పారు. గత 14 నెలల్లో ఒక్కసారి కూడా మోదీ బీహార్ గురించి పట్టించుకోలేదని ఎన్నికలనగానే హడావుడి చేస్తున్నారని తెలిపారు. తమ రాష్ట్ర గౌరవం దెబ్బతినేలా ఎవరు మాట్లాడిన వారికి తగిన సమాధానం చెప్పేందుకు తామెప్పుడూ సిద్ధమే అని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement