
పట్నా: రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి కుష్వాహా బయటకు వెళ్లిపోయినా, తాము కూటమిలోనే ఉంటామని బిహార్ ఆర్‌ఎల్‌ఎస్పీ ఎమ్మెల్యేలు సుధాంశు శేఖర్, లలన్ పాశ్వాన్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్ శ్యామ్ చెప్పారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే కుష్వాహా ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. ఆర్‌ఎల్‌ఎస్పీలో మెజారిటీ ఆఫీస్‌బేరర్ల మద్దతు తమకే ఉందన్నారు. ఆల్‌ఎల్‌ఎస్పీ ఎన్నికల గుర్తు విషయమై త్వరలోనే ఈసీని కలుస్తామని తెలిపారు. ఆర్‌ఎల్‌ఎస్పీకి బిహార్‌లో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment