_న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల నియామకాలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.
-పాట్నా పేరును మార్చాలి.
పట్నా: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కౌశ్వా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనుక బడినతరగతుల(ఓబీసీ) వారికి న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఓబీసీలు వ్యక్తులు ఎందుకు న్యాయవ్యవస్థలో పై స్థాయికి రావడం లేదు? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎప్పటికీ ఉన్నత కులానికి
చెందిన వారే ఎందుకు నియమించబడుతున్నారు.? ఓబీసీలు ఎందుకు న్యాయమూర్తులుగా ఎదగలేక పోతున్నారు.? వీటన్నిటికీ
పరిష్కారం లభించాలంటే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకాలకు తమప్రభుత్వం చట్టం చేసింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయి. కానీ న్యాయస్థానాలు మాత్రం ఆచట్టం చెల్లదని తీర్పునిచ్చిందని నేషనల్ జ్యుడిషియరీ కమిషన్ ను పరోక్షంగా ప్రస్తావించారు.
పట్నా పేరు మార్చాలి:
బీహార్ రాజధాని పట్నా పేరును అశోక చక్రవర్తి గౌరవార్థం పాటలీపుత్రంగా మార్చాలని అన్నారు. ఈ అంశాన్ని తాము అనేకఏళ్లుగావివిధ
వేదికలపై డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిరిజు మాట్లాడుతూ...అశోకుడు లేకపోతే బౌద్ధ మతం,
భారతదేశం అసంపూర్తిగా ఉండేదని అన్నారు. ప్రపంచం మొత్తానికి ప్రేమ, మానవత్వాన్ని అశోకుడు విస్తరించాడని పేర్కొన్నారు. అశోకచక్రం లేని ప్రభుత్వం అసంపూర్తిగా ఉంటుందని తెలిపారు. అశోకుని మార్గంలో పయనించే పౌరులు 'నిజమైన దేశ పౌరులు' గా తయారవుతారని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ బుద్దిస్ట్ కాన్పెడరేషన్, అశోక జయంతి ఉత్సవ నిర్వాహకులు ఈ సందర్భంగా అశోకుని జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని తీర్మానం చేశారు.