OBC quota
-
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భోపాల్: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశమైంది. తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్ యాదవ్ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామా సమరి్పంచారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
కులగణన అంటే మోదీకి భయమెందుకు?
జైపూర్: దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని పునద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా కల్సించాలని అన్నారు. రాహుల్ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యమేనని రాహుల్ స్పష్టం చేశారు. జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన ముసుగులో ఈ రిజర్వేషన్లను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓబీసీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. దయచేసి ఓబీసీలను మోసం చేయకండి అని కోరారు. కుల గణన గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయతి్నస్తే బీజేపీ సభ్యులు తన గొంతుకను అణచివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ బబ్బర్ షేర్స్ (సింహాలు)గా అభివరి్ణంచారు. అదానీతో ప్రధాని మోదీ సంబంధాలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు. -
Womens Reservation Bill 2023: ఓబీసీలను అధికారానికి దూరం చేశారు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీయే హయాంలో తాము ప్రతిపాదించిన బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తామని పేర్కొనపోవడం పట్ల తనకిప్పటికీ ఎంతగానో ఆవేదనగా ఉందని చెప్పారు. ఇప్పుడు వారికి రిజర్వేషన్ కోసం పట్టుబడతామని ఒక ప్రశ్నకు బదులుగా స్పష్టం చేశారు. మోదీ సర్కారు ఫక్తు రాజకీయ కారణాలతోనే మహిళా బిల్లు తెచి్చందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీలకు ప్రత్యేక కోటా పెట్టకపోవడం ద్వారా వారిని అధికారానికి దూరం చేసిందని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తక్షణం కుల గణన చేపట్టి, ఆ వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగపరచాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇతర సామాజిక వర్గాల మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దృష్టి మళ్లించే నాటకమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను అధికార బీజేపీ ప్రతిపాదించినప్పుడు తాము ఆహ్వానించామని రాహుల్ అన్నారు. ‘ఆ సందర్భంగా ఎంపీలమంతా అట్టహాసంగా పార్లమెంటు పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి మారాం కూడా. మోదీ కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో రాజ్యాంగ ప్రతిని చేబూనారు. ’అతి ముఖ్యమైన బిల్లును ఆమోదించబోతున్నాం, అంతా సహకరించండి’ అని అన్నారు. ఆయన ప్రతిపాదించిన మహిళా బిల్లు నిస్సందేహంగా వారి సాధికారత దిశగా కీలక అడుగు. కానీ జన గణన, డీ లిమిటేషన్ రూపంలో రెండు మెలికలు పెట్టారు. వాటివల్ల అది మరో పదేళ్లకు గానీ అమల్లోకి రాదు. ఇది ఫక్తు సమస్యల నుంచి దృష్టి మళ్లించే కుట్రే‘ అని ఆరోపించారు. అధిక సంఖ్యాకులకు అధికారమేది? కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కేవలం ముగ్గురు ఓబీసీలు మాత్రమే ఉన్నారని తెలిసి తాను షాకయ్యానని రాహుల్ అన్నారు. ‘ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కలిపి బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం ఆరు శాతం! ప్రధాని మోదీ మాట్లాడితే తాను ఓబీసీ నేతను అంటుంటారు. వారి చేతుల్లో అధికారం లేని ఈ దురవస్థకు కారణం ఏమిటో ఆయనే చెప్పాలి. ఈ చేదు నిజాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఓబీసీలు ఎందరు? ఇతర సామాజికవర్గాల వారు ఎందరు? ఇవిప్పుడు కీలక ప్రశ్నలు. అందుకే మేం కుల గణనకు డిమాండ్ చేస్తున్నాం‘ అని చెప్పారు. ‘దేశ ప్రజలకు అధికారాన్ని బదలాయించాలంటే ఈ సామాజిక గణాంకాలు తెలియడం చాలా అవసరం. జన గణన ఇప్పటికే జరిగింది గనుక ఈ లెక్కలన్నీ ఇప్పటికే కేంద్రం వద్ద అన్నాయి. ప్రధాని మోదీ వాటిని ఎందుకు విడుదల చేయడం లేదు?‘ అని రాహుల్ ప్రశ్నించారు. వారికి భాగస్వామ్యం ఉందా? తమ పార్టీలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్న బీజేపీ వాదనను రాహుల్ ఎద్దేవా చేశారు. ‘చట్టాల రూపకల్పనలో, దేశ ద్రవ్య వినిమయంలో వారు ఏ మేరకు పాలుపంచుకుంటున్నారో అడగండి. అసలే లేదని వారే అంగీకరిస్తారు‘ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే లోక్ సభలో బీజేపీ ఎంపీలకు వాస్తవంలో ఎలాంటి అధికారాలూ లేవని రాహుల్ అన్నారు. వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారన్నారు. ఒక బీజేపీ ఎంపీయే తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే. రాహుల్ ది ట్యూటర్ తెలివిడి 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు. నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. వాగ్వాదం రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు. -
ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2న జస్టిస్ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్‌ను ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్‌కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్ రోహిణి కమీషన్ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?) - కోడెపాక కుమార స్వామి సామాజిక విశ్లేషకులు -
చట్టసభల్లో బీసీ కోటాపై మీ చిత్తశుద్ధి ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై మీ చిత్తశుద్ధి ఏంటని కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నించింది. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ బండ ప్రకాశ్ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారాలను రాష్ట్రాలకు దఖలుపరుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. పొరపాటును సరిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పునరుద్ధరించడం అభినందనీయం. బీసీ జాబితాలో పలు కులాలను చేర్చాలంటూ వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ జనాభా పెరిగినప్పుడు.. బీసీ రిజర్వేషన్ తగ్గుతూ వస్తోంది. 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 50 శాతం ఏ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఏ డేటాను అనుసరించి నిర్ణయిస్తోంది? శాస్త్రీయ ప్రాతిపదిక ఏముంది? 1931 నుంచి దేశంలో కులాల జనగణన లేదు. ఓబీసీ జనగణన చేస్తామని 2018లో అప్పటి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రోడ్‌మ్యాప్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలి. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు, చివరకు పీహెచ్డీ ప్రవేశాల్లో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు కావ డం లేదు. సమానత్వం కోసం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కేంద్రానికి పంపారు. కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లపై మీకున్న చిత్తశుద్ధి ఏంటి? లోక్‌సభలో, రాజ్యసభలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి’అని డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ‘న్యాయ వ్యవస్థ వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తోంది. వెనకబడిన తరగతుల విషయానికి వచ్చేసరికి వారు పరిమితి గురించి ఆలోచిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విషయంలో వారు ఎందుకు పరిమితి ఆలోచించరు? కేంద్రం స్వయంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ 50 శాతం పరిమితిని ఉల్లంఘించింది. సుప్రీంకోర్టు ఎం దుకు మౌనంగా ఉంది? మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం బీసీల విషయంలోనే క్రీమీలేయర్ గురిం చి ఆలోచిస్తారు. ఇతర విషయాల్లో ఎందుకు ఇలా చేయరు? ఈ క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రాజ్యాంగంలో ఉందా? మైనా రిటీలు, మహిళలు, ఎస్సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఉండదు? బీసీల అభ్యున్నతి లేనప్పుడు దేశాభివృద్ధి కూడా సాధ్యం కాదు’అని బండ ప్రకాశ్ చెప్పారు. -
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, ఓబీసీలకు, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు పొంద నున్నారని పేర్కొన్నారు, మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం కల్పించాలని ప్రధాని మోదీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N — Narendra Modi (@narendramodi) July 29, 2021 -
ఫడ్నవిస్‌కు చురకలు, ప్రజలను పట్టించుకునే వారే నాయకులు
సాక్షి ముంబై: బల ప్రదర్శన చేసేవారు నాయకులు కాదని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి జాగ్రత్తపడే వారే అసలైన నాయకులని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ఆందోళన చేపట్టిన బీజేపీపై సీఎం మండిపడ్డారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన పేరుతో జనాన్ని పోగుచేసి చేసి తన బలాన్ని నిరూపించుకోవడం నాయకుని లక్షణం కాదని చురకలంటించారు. శనివారం కొల్హపూర్‌లో సారథి ఉప కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కరోనా ముప్పు ఒక్క మహారాష్ట్రలోనే కాదు, ప్రపంచంలో కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆందోళనలు చేసి రద్దీ చేయడంపై ఉద్ధవ్ మండిపడ్డారు. ఏదైనా అంశంపై అవసరమైనప్పుడు చర్చలు కూడా జరిపి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లపై అందరి మాట ఒక్కటే రిజర్వేషన్ కల్పించాలని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో అందరూ పార్టీలకతీతంగా ఒక్కటై పోరాడాలని, ఇందుకోసం ఆందోళనలు కాకుండా చర్చలు జరపాలంటూ పరోక్షంగా ఫడ్నవిస్‌కు చురకలంటించారు. -
Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?
సాక్షి ముంబై: తమకు అధికారం కల్పిస్తే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అలా ఇప్పించలేని పక్షంలో రాజకీయ సన్యాసానికైనా సిద్ధమేనని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే ఓబీసీలు రిజర్వేషన్ కోల్పోయారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరగనివ్వం అని ఫడ్నవిస్ తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ లేకుండా ఆఘాడీ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అనేక ప్రాంతాల్లో జైలు భరోతోపాటు చక్కా జామ్ ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌తోపాటు ఆశీష్ శెలార్, ప్రవీణ్ దరేకర్ తదితరుల నేతృత్వంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఆందోళన జరిగింది. దీంతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతమైన వాతావరణం ఏర్పడగా మరోవైపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో ముందు నుంచే అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆందోళన చేపట్టడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు అనేక మంది నేతలను అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, మరాఠా రిజర్వేషన్‌తోపాటు ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఓ వైపు స్థానిక స్వరాజ్య సంస్థల ఎన్నికలు మరోవైపు ముంబై, థాణే, పుణేలతోపాటు 10 మున్సిపల్ కార్పొరేషన్లలో జరగబోయే ఎన్నికలు తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీసింది. మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా.. రాష్ట్రంలో స్థానిక స్వరాజ్య సంస్థల ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓబీసీల రాజకీయ రిజర్వేషన్ కోటా లేకుండానే కమిషన్ ఎన్నికలు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీజేపీ శనివారం ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలిపింది. నాగ్‌పూర్‌లో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ ఆఘాడీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కోసమే ఈ ఆందోళన చేపట్టామని, రిజర్వేషన్ వారికి ఇప్పించలేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరగనివ్వం అంటూ హెచ్చరించారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించవచ్చని, తమకు అధికారం కల్పిస్తే రిజర్వేషన్ ఇస్తామని ఫడ్నవిస్ హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఏది జరిగినా అది మోదీ కారణంగానే అని మహావికాస్ ఆఘాడీ నేతలు ఆరోపిస్తున్నారని, రేపు ఆ నేతల భార్యలు వారిని కొట్టినా అది మోదీ బాధ్యతనే అనేలా ఉన్నారని ఫడ్నవిస్ చురకలంటించారు. కోల్హాపూర్‌లో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నేతృత్వంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, విజయ్ వడెట్టివార్‌లతోపాటు ఉపముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. కనీసం ఓబీసీ నేతలతో చర్చలు కూడా జరిపేందుకు సిద్దంగా లేరని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనంతోనే రిజర్వేషన్ కోల్పోయినట్లు పాటిల్ ఆరోపించారు. షోలాపూర్‌లో... షోలాపూర్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సిద్దేశ్వర్ మార్కెట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, షోలాపూర్ మేయర్ శ్రీకాంచన యెన్నం, పట్టణ అధ్యక్షుడు విక్రం దేశ్‌ముఖ్‌ల నేతృత్వంలో కొనసాగిన ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముంబైలో ఆశీష్ శెలార్, ఎంపీ మనోజ్ కోటక్, పుణేలో పంకజా ముండే, థానేలో ప్రవీణ్ దరేకర్ తదితరుల నేతృత్వంలో నిరసనలు జరిగాయి. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ? -
50% ఓబీసీ కోటాకు నో
న్యూఢిల్లీ: వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు ఈ విద్యా సంవత్సరం నుంచే 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమ రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డెంటల్ కోర్సులకు ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్‌ను 2020–21 విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ ఏఐఏడీఎంకే పెట్టుకున్న అర్జీలపై సోమవారం జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జూలై 27వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల అమలు విధానపరమైన అంశం అయినందున కేంద్రానికి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఓబీసీ కోటా అమలు చేయాలనే విషయంలో కూడా మద్రాస్ హైకోర్టు ఒక స్పష్టత ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 50 శాతం కోటా అమలు ఆచరణలో సాధ్యం కాదని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తమిళనాడు పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం స్టే అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారాన్ని భౌతికంగా కాకుండా ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చని రాజకీయ పార్టీలకు సూచిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికల ర్యాలీలపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల ›సంఘానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రాలేదన్న విషయాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు గుర్తించాలని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికల విషయంలో అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని ఎన్నికల సంఘం ధర్మాసనానికి తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 3వ తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతోనే ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భవితవ్యం తేలిపోనుంది. -
ఓబీసీ రిజర్వేషన్లపై మోదీకి లేఖ
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ క్రిమీలేయర్‌ను రూ.8లక్షల నుంచి రూ.15లక్షల ఆదాయ పరిమితికి పెంచాలని ఎంపీ విశంభర్ పేర్కొన్నారు. గత నెల సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓబీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నీట్ కోటాపై మోదీకి సోనియా లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష( నీట్) ఆలిండియా కోటా ద్వారా వైద్య కళాశాలల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. రిజర్వేషన్లు నిరాకరించడంతో ఓబీసీలు 2017 నుంచి 11,000 సీట్లను కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ఆలిండియా కోటా ద్వారా భర్తీ చేసే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య కళాశాలల్లో ఓబీసీ విద్యార్ధులకు రిజర్వేషన్లను నిరాకరిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆలిండియా కోటా కింద షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఓబీసీలకు 10 శాతం సీట్లను కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఓబీసీ అభ్యర్ధుల రిజర్వేషన్‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వైద్య విద్యా సంస్ధలు అమలు చేయడం లేదని, కేవలం జాతీయస్ధాయి వైద్య విద్యాసంస్ధల్లోనే ఓబీసీ కోటా వర్తింపచేస్తున్నారని లేఖలో వివరించారు. రాష్ట్రాల్లోని వైద్య విద్యా సంస్ధల్లో ఓబీసీ విద్యార్ధుల రిజర్వేషన్ అమలుకు నోచుకోకపోవడంతో అర్హులైన అభ్యర్ధులకు వైద్య విద్యను అభ్యసించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రయోజనాలు అందరికీ అందేలా ఓబీసీ విద్యార్ధుల ఆలిండియా కోటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వైద్య సంస్థల్లో కూడా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఈ లేఖలో ప్రధాని మోదీని సోనియా కోరారు. (చదవండి : మోదీ విధానాల వల్లే వివాదం) ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ వైద్య సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి కేటాయిస్తాయి.ఈ సీట్లలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా విద్యార్ధులు రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా సుప్రీంకోర్టు వద్ద ఓబీసీ కోటా వ్యవహరం పెండింగ్‌లో ఉండటంతో అది పరిష్కారమయ్యేవరకూ ప్రభుత్వ విద్యాసంస్ధల్లో ఆలిండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధుల అడ్మిషన్‌పై ఓ నిర్ణయం తీసుకోలేమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు నివేదించింది. మరోవైపు మేలో జరగాల్సిన నీట్ పరీక్ష కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదా పడింది. కోవిడ్-19 కేసుల వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష ఇప్పట్లో జరిగే పరిస్ధితి కనిపించడం లేదు. ఇక జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాపై నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఓ నిర్ణయం తీసుకుంటామని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ వెల్లడించారు. -
ఆశ.. దోశ.. అంచనాలు తలకిందులు!
భువనేశ్వర్: జనాభా లెక్కల జాబితాలో ఇతర వెనుక బడిన వర్గాల(ఓబీసీ)కు ప్రత్యేక స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థన పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు తలకిందులు కావడంతో నిరుత్సాహానికి గురైంది. పార్లమెంటు సమావేశాల్లో గడిచిన రెండు రోజుల నుంచి బిజూ జనతా దళ్ సభ్యులు ఈ ప్రతిపాదనపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలతో పలు అనుబంధ సంస్థల సంప్రదింపుల మేరకు 2021 జనాభా లెక్కల జాబితా నమూనా ఖరారు చేశారు. గత ఏడాది మార్చి 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తాజా జనాభా లెక్కింపు ధ్యేయం సవివరంగా స్పష్టం చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గురువారం స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం నిబంధనల మేరకు షెడ్యూల్డ్ కులం, తెగల వర్గాల్లో మార్పు చేర్పుల సమీక్ష దృష్ట్యా ఈ వివరాల సేకరణ కోసం జనాభా లెక్కల జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు. రాష్ట్రానికి కేంద్రమంత్రి ప్రతిపాదన రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాల ప్రజానీకం ప్రాముఖ్యాన్ని స్థానిక రాజకీయ పక్షాలు గుర్తించాయి. ప్రధానంగా అధికార పక్షం బిజూ జనతా దళ్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఓబీసీ వర్గం వైపు కన్నేశాయి. ఈ వర్గపు ప్రజానీకంతో బలమైన ఓటు బ్యాంకు ఆవిష్కరణ కోసం ఎవరి తరహాలో వారు సిగపట్లు పడుతున్నారు. బిజూ జనతా దళ్ సభ్యులు పార్లమెంటులో భారత ప్రభుత్వంపై పెంచుతున్న ఒత్తిడి దృష్ట్యా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార పక్షానికి తాజా ప్రతిపాదన జారీ చేశారు. తొలుత రాష్ట్రంలో ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలి. ఈ వర్గపు ప్రజల కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇతరేతర సకల సదుపాయాల్ని కల్పించేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం ఆమోదించాలని కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు ప్రతిపాదించి కథను మలుపుతిప్పేందుకు బీజం నాటారు. జనాభా లెక్కింపు సహకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనాభా లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన రిజిస్ట్రార్ జనరల్, లెక్కింపు కమిషనర్ జారీ చేసిన గెజిట్ నేపథ్యంలో సకల సహకార చర్యలు చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటింటి జనాభా లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు 30వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ–విపత్తు నిర్వహణ విభాగం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
‘అలా చేయకపోతే.. మా పిల్లలు బిచ్చగాళ్లు అవుతారు’
సాక్షి, ఢిల్లీ : క్రిమిలేయర్ ఎత్తివేయాలని గతంలో చాలాసార్లు కోరానని.. క్రిమిలేయర్‌ను ఎత్తివేయకపోతే తమ పిల్లలు బిచ్చగాళ్లు అయిపోతారని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఓబీసీ కమీషన్ తెలంగాణ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వీహెచ్ మాట్లాడుతూ.. 1993లో ఓబీసీ కమీషన్ ఏర్పడిందని అయినా బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో 9శాతం కంటే ఎక్కువ దాటడం లేదని పేర్కొన్నారు. కమిటీ కొన్ని కులాలను బీసీల్లో కలుపుతామని అంటున్నారు.. అయితే తాను దానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఏడాదికి 8లక్షలు దాటితే రిజర్వేషన్ వర్తించదని, బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అన్నారు. తమ పిల్లలకు, చదువు, ఉద్యోగ అవకాశాలు రావడం లేదని అన్నారు. క్రిమిలేయర్ వల్ల తమకు వచ్చే ఉద్యోగాలు అగ్ర కులాలకు పోతున్నాయని తెలిపారు. గతంలో బైసన్‌పోలో గ్రౌండ్ విషయంలో తాను పబ్లిక్ పోల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు 97శాతం మంది ప్రజలు వారి స్పందన తెలిపారన్నారు. అలాగే మళ్లీ ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణంపై పబ్లిక్ ఒపీనియన్ అడగుతామన్నారు. -
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
ఓబీసీలను ఐదు గ్రూపులుగా విభజించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ కులాలను ఐదు గ్రూపులుగా విభజించి, గ్రూపుల వారీగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కులాల వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ బుధవారం ఢిల్లీలో జస్టిస్ రోహిణిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వర్గీకరణ శాస్త్రీయంగా సమన్యాయం జరిగేలా చేయాలని, ఒక్కో రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి ఓబీసీల స్థితిగతులను విశ్లేషించాలని నేతలు కోరారు. 2011 జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కలు సేకరించారని, కేంద్రం వీటిని ప్రకటిస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాంతో సమావేశమైన నేతలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. -
ఓబీసీ ఉప వర్గీకరణకు సూచనలిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కీలకమైన ఓబీసీ కోటా ఉపవర్గీకరణపై రాష్ట్ర బీసీ కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఓబీసీ ఉపవర్గీకరణ అధ్యయనం కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీకి తెలంగాణ స్థితిగతులను వివరించేందుకు బీసీ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలదే. అయితే ప్రస్తుతం 50 శాతంలోపు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీల వాటా 60 శాతం దాటుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ ఇప్పటికే అధ్యయనం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాలు, నిరుద్యోగులు, బీసీల ఆర్థిక స్థితిగతులపై పరిశీలన దాదాపు పూర్తి చేసింది. క్షేత్రస్థాయి సర్వే మినహా మిగతా ప్రక్రియ పూర్తయిందని సమాచారం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ఉపవర్గీకరణకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర బీసీ కమిషన్ ఈమేరకు సమగ్ర నివేదిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో పరిస్థితులను ఇందులో వివరించబోతోంది. ఇదే క్రమంలో ఓబీసీ ఉపవర్గీకరణపై దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేయబోతోంది. ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర బీసీ కమిషన్లను ఆహ్వానించనుంది. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సదస్సు అనంతరం ఓబీసీ ఉపవర్గీకరణపై చేసే తీర్మానాలను అధ్యయన బృందానికి అందించే అవకాశం ఉంది. -
న్యాయవ్యవస్థలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి
_న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల నియామకాలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. -పాట్నా పేరును మార్చాలి. పట్నా: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కౌశ్వా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనుక బడినతరగతుల(ఓబీసీ) వారికి న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు వ్యక్తులు ఎందుకు న్యాయవ్యవస్థలో పై స్థాయికి రావడం లేదు? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎప్పటికీ ఉన్నత కులానికి చెందిన వారే ఎందుకు నియమించబడుతున్నారు.? ఓబీసీలు ఎందుకు న్యాయమూర్తులుగా ఎదగలేక పోతున్నారు.? వీటన్నిటికీ పరిష్కారం లభించాలంటే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకాలకు తమప్రభుత్వం చట్టం చేసింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయి. కానీ న్యాయస్థానాలు మాత్రం ఆచట్టం చెల్లదని తీర్పునిచ్చిందని నేషనల్ జ్యుడిషియరీ కమిషన్ ను పరోక్షంగా ప్రస్తావించారు. పట్నా పేరు మార్చాలి: బీహార్ రాజధాని పట్నా పేరును అశోక చక్రవర్తి గౌరవార్థం పాటలీపుత్రంగా మార్చాలని అన్నారు. ఈ అంశాన్ని తాము అనేకఏళ్లుగావివిధ వేదికలపై డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిరిజు మాట్లాడుతూ...అశోకుడు లేకపోతే బౌద్ధ మతం, భారతదేశం అసంపూర్తిగా ఉండేదని అన్నారు. ప్రపంచం మొత్తానికి ప్రేమ, మానవత్వాన్ని అశోకుడు విస్తరించాడని పేర్కొన్నారు. అశోకచక్రం లేని ప్రభుత్వం అసంపూర్తిగా ఉంటుందని తెలిపారు. అశోకుని మార్గంలో పయనించే పౌరులు 'నిజమైన దేశ పౌరులు' గా తయారవుతారని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ బుద్దిస్ట్ కాన్పెడరేషన్, అశోక జయంతి ఉత్సవ నిర్వాహకులు ఈ సందర్భంగా అశోకుని జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని తీర్మానం చేశారు.