సాక్షి ముంబై: బల ప్రదర్శన చేసేవారు నాయకులు కాదని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి జాగ్రత్తపడే వారే అసలైన నాయకులని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ఆందోళన చేపట్టిన బీజేపీపై సీఎం మండిపడ్డారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన పేరుతో జనాన్ని పోగుచేసి చేసి తన బలాన్ని నిరూపించుకోవడం నాయకుని లక్షణం కాదని చురకలంటించారు.
శనివారం కొల్హపూర్‌లో సారథి ఉప కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కరోనా ముప్పు ఒక్క మహారాష్ట్రలోనే కాదు, ప్రపంచంలో కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆందోళనలు చేసి రద్దీ చేయడంపై ఉద్ధవ్ మండిపడ్డారు. ఏదైనా అంశంపై అవసరమైనప్పుడు చర్చలు కూడా జరిపి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్‌లపై అందరి మాట ఒక్కటే రిజర్వేషన్ కల్పించాలని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో అందరూ పార్టీలకతీతంగా ఒక్కటై పోరాడాలని, ఇందుకోసం ఆందోళనలు కాకుండా చర్చలు జరపాలంటూ పరోక్షంగా ఫడ్నవిస్‌కు చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment