![Samajwadi MP Demands OBC Quota in Private Sector Jobs - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/29/kj.jpg.webp?itok=WqVGAQjz)
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్‌లపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ క్రిమీలేయర్‌ను రూ.8లక్షల నుంచి రూ.15లక్షల ఆదాయ పరిమితికి పెంచాలని ఎంపీ విశంభర్ పేర్కొన్నారు. గత నెల సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓబీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment