ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత, మాజీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన యూపీలోని కాస్‌గంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు అరాచకవాదులను కాల్చిచంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు జారీ చేసిందని’ వ్యాఖ్యానించారు.
అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు . అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "...To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty..." pic.twitter.com/tpYf8wdMnJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024
Comments
Please login to add a commentAdd a comment