kar sevaks
-
‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం!
అది.. 1992, డిసెంబర్.. దేశం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కరసేవకుల బృందం కూడా అయోధ్యకు తరలివచ్చింది. వారిలో జోధ్‌పూర్ నివాసి కన్రాజ్ మొహ్నోత్ కూడా ఉన్నారు. నాటి ఆ ఉద్యమం గురించి కన్రాజ్ మొహ్నోత్ మాట్లాడుతూ ‘ఆ సమయంలో కరసేవకులు ఉత్సాహంతో అయోధ్యవైపు పయనవుతున్నారు. ఇదే సందర్భంలో రైళ్లలో ముమ్మర తనిఖీలు జరిగాయి. పలువురిని పోలీసులు విచారించారు. కొన్ని చోట్ల కరసేవకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మేము అయోధ్య కన్నా ముందుగా వచ్చే ఒక స్టేషన్లో దిగాం. అనంతరం బృందాలుగా ఏర్పడి, కాలినడకన రహస్యంగా హనుమాన్‌నగర్ చేరుకున్నాం. ఉద్యమ సమయంలో మృత్యువుకు దగ్గరగా వెళ్లిన రోజు నాకింకా గుర్తుంది. తుపాకీ బుల్లెట్ నా చెవిని దాటి వెళ్లింది. శ్రీరాముని దయతో అపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాను. అయితే ఆ బుల్లెట్ నా వెనుకనున్న కరసేవకుడు సీతారామ్ పరిహార్‌కి తగిలింది. ఆ ప్రదేశంలో ఆసుపత్రి ఎక్కడుందో మాకు తెలియలేదు. అక్కడున్న స్థానికులు కూడా మాకు సహాయం చేయలేదు. చివరకు గంటన్నర పాటు మృత్యువుతోపోరాడిన సీతారాం చనిపోయాడు. ప్రొఫెసర్ మహేంద్రనాథ్ అరోరా కూడా ఇదేవిధంగా ప్రాణత్యాగం చేశారు. వారిద్దరి మృతదేహాలను అయోధ్య నుంచి వ్యాన్‌లో వారి స్వస్థలమైన జోధ్‌పూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశాం. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత అయోధ్య రామాలయం కల నెరవేరింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి! -
‘కరసేవకులపై కాల్పులు సబబే’.. ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత, మాజీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన యూపీలోని కాస్గంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు అరాచకవాదులను కాల్చిచంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు జారీ చేసిందని’ వ్యాఖ్యానించారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు . అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "...To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty..." pic.twitter.com/tpYf8wdMnJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024 -
యమునలో కరసేవకులకు పిండ ప్రధానం
అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆలయాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్ ఘాట్ వద్ద కరసేవకులకు ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పిండ ప్రధానం చేయనున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కోసం పిండ ప్రధానాన్ని డిసెంబర్ 6న మధురలో నిర్వహించనున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) జాతీయ అధ్యక్షుడు రాజ్యశ్రీ చౌదరి తెలిపారు. నాడు అయోధ్యలో కవాతు చేస్తున్న కరసేవకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనను చౌదరి గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన త్యాగాన్ని మనం ఎన్నటికీ మరువలేమన్నారు. రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయిన నేపధ్యంలో, రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న తరుణంలో మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2019 నవంబరు 9న సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పునిస్తూ, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు? -
నేపాలీ అమ్మాయిలతో భారతీయ అబ్బాయిల పెళ్లి
లక్నో : వివాదాస్పదమైన అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. తాజాగా కరసేవకులు తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయిన అబ్బాయిలకు, సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్(నేపాల్) అమ్మాయిలను వివాహం పేరుతో ఒకటి చేయబోతున్నట్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి మొత్తం 108 మంది తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ వివాహ వేడుకను' శ్రీరామ్-జానకి వివాహ్ బరాత్ యాత్ర- అయోధ్య సే జనక్‌పూర్' పేరుతో నిర్వహించనున్నట్లు విశ్శ హిందూ పరిషత్‌కు చెందిన ధర్మయాత్ర మహాసంఘ్ వెల్లడించింది. ఈ వేడుకను మొత్తం 13 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 21న అయోధ్యలోని కర్‌సేవక్‌పురమ్ జంకి ఘాట్ నుంచి కన్య పూజ, తిలకోత్సవం పేరుతో మొదలై డిసెంబర్ 4న గోరక్‌పూర్‌లో జరిగే బరాత్ కార్యక్రమంతో ముగుస్తుందని పేర్కొన్నారు. చివరిరోజు వేడుకకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హాజరవనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకుకు సంబంధించి యూపీ నుంచి అంబేద్కర్‌నగర్, మావు, అజామ్‌ఘర్, బీహార్ నుంచి బక్సర్, పటలీపుత్ర, హాజీపూర్, ముజఫర్‌పూర్,సీతామర్హి, దర్బంగా, మోతీహరి ప్రాంతాలను స్వాగత ద్వారాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే వీరి వివాహాలు నేపాల్‌లోని ధశరథ్ మందిర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం భారత్- నేపాల్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని, అంతేగాక సంప్రదాయలో ఒకే విధంగా ఉండే రెండు దేశాల మధ్య అడ్డు ఉన్నది సరిహద్దు మాత్రమేనని పేర్కొన్నారు. ' రామ మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దీనిని ముడిపెట్టొద్దు. ప్రతీ ఐదేళ్లకోసారి ఇలాంటి వేడుకను నిర్వహిస్తుంటాం. అయితే ఈసారి యాదృశ్చికంగానే మాకు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం వరకు ప్రతీ ఒక్కరిని ఆహ్వానించినట్లు' కార్యక్రమ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్ పంకజ్ పేర్కొన్నారు.