అది.. 1992, డిసెంబర్.. దేశం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కరసేవకుల బృందం కూడా అయోధ్యకు తరలివచ్చింది. వారిలో జోధ్‌పూర్ నివాసి కన్రాజ్ మొహ్నోత్ కూడా ఉన్నారు.
నాటి ఆ ఉద్యమం గురించి కన్రాజ్ మొహ్నోత్ మాట్లాడుతూ ‘ఆ సమయంలో కరసేవకులు ఉత్సాహంతో అయోధ్యవైపు పయనవుతున్నారు. ఇదే సందర్భంలో రైళ్లలో ముమ్మర తనిఖీలు జరిగాయి. పలువురిని పోలీసులు విచారించారు. కొన్ని చోట్ల కరసేవకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మేము అయోధ్య కన్నా ముందుగా వచ్చే ఒక స్టేషన్‌లో దిగాం. అనంతరం బృందాలుగా ఏర్పడి, కాలినడకన రహస్యంగా హనుమాన్‌నగర్ చేరుకున్నాం.
ఉద్యమ సమయంలో మృత్యువుకు దగ్గరగా వెళ్లిన రోజు నాకింకా గుర్తుంది. తుపాకీ బుల్లెట్ నా చెవిని దాటి వెళ్లింది. శ్రీరాముని దయతో అపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాను. అయితే ఆ బుల్లెట్ నా వెనుకనున్న కరసేవకుడు సీతారామ్ పరిహార్‌కి తగిలింది. ఆ ప్రదేశంలో ఆసుపత్రి ఎక్కడుందో మాకు తెలియలేదు. అక్కడున్న స్థానికులు కూడా మాకు సహాయం చేయలేదు. చివరకు గంటన్నర పాటు మృత్యువుతోపోరాడిన సీతారాం చనిపోయాడు. ప్రొఫెసర్ మహేంద్రనాథ్ అరోరా కూడా ఇదేవిధంగా ప్రాణత్యాగం చేశారు. వారిద్దరి మృతదేహాలను అయోధ్య నుంచి వ్యాన్‌లో వారి స్వస్థలమైన జోధ్‌పూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశాం. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత అయోధ్య రామాలయం కల నెరవేరింది’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి!
Comments
Please login to add a commentAdd a comment