లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగి అంటున్నట్లు తానెవరినీ ఫూల్స్ చేయలేదని, లోక్‌సభ ఎన్నికల్లో యోగి ఆయన సొంత పార్టీ అధిష్టానాన్నే ఫూల్‌ను చేశారని అఖిలేష్ ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్‌వాదీ ఫ్లోర్‌లీడర్(ఎల్‌వోపీ)గా మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై అఖిలేష్‌పై యోగి సెటైర్లు వేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా ప్రసాద్‌పాండేకు స్వాగతం చెబుతూనే ఎల్‌వోపీ పదవి ఇవ్వకుండా మామ శివపాల్‌యాదవ్‌ను అఖిలేష్ ఫూల్‌ను చేశారన్నారు. అఖిలేష్ ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని చురకలంటించారు.
అయినా మామ శివపాల్‌కు మోసపోవడం అలవాటైపోయిందన్నారు. దీనికి స్పందించిన అఖిలేష్ తానెవరినీ ఫూల్‌ను చేయలేదని, యోగి ఏకంగా ఆయన పార్టీ హైకమాండ్‌నే ఫూల్‌ను చేశారని కౌంటర్ ఇచ్చారు. ఇక శివపాల్ యాదవ్ ఇదే విషయమై స్పందిస్తూ 2027లో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమాజ్‌వాదీపార్టీలో అందరం సమానమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment