మన దేశంలోనూ నాయకుడు ఇంటికెళ్లడం ఖాయం: అఖిలేశ్
లక్నో: 2014లో అధికారంలోకి వచ్చిన నాయకుడు 2024లో పదవి నుంచి దిగిపోతాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ కేవలం 10 సంత్సరాలే అధికారంలో ఉన్నాడని గుర్తుచేశారు. మన దేశంలోని నాయకుడు పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడని, ఇక ఆయన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసిందని తేల్చిచెప్పారు.
ఆ నాయకుడికి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని, రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు అంతే ఘనంగా వీడ్కోలు చెబుతారని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను, మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment