జేఎన్‌వీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం సరైనది కాదని ఉపేంద్ర కుష్వాహా అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ) ఓబీసీ విద్యార్థులకు కోటా కల్పించకలేకపోవడం పట్ల ఆ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా విస్మయం వ్యక్తంచేశారు. సమీప భవిష్యత్తులో దీనికి పరిష్కారం కనుగొంటామని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు 600 జేఎన్‌వీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.