సీఎం నితీశ్‌కుమార్, ఉపేంద్ర కుష్వాహా
పట్నా: బిహార్‌లో ఎన్డీయే మిత్ర పక్షాలు జేడీ(యూ), ఆర్‌ఎల్‌ఎస్పీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ఫిర్యాదుచేస్తానని కుష్వాహా తెలిపారు. పార్టీలను చీల్చడంలో నితీశ్ ఆరితేరారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్‌లో సీట్ల పంపకంపై త్వరగా స్పష్టత ఇవ్వాలని షాపై ఒత్తిడితెస్తానని చెప్పారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను కలుసుకున్న తరువాత ఆర్‌ఎల్‌ఎస్పీ ఎమ్మెల్యే సుధాంశు శేఖర్ పార్టీ మారబోతున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కుష్వాహా పైవిధంగా స్పందించారు. మరో ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ కూడా జేడీయూలో చేరే అవకాశాలున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment