మద్యమే ఎన్నో అనర్థాలకు కారణం: నారాయణ స్వామి | Narayana Swamy Inaugurated Liquor Prohibition Committee | Sakshi
Sakshi News home page

మద్యమే ఎన్నో అనర్థాలకు కారణం: నారాయణ స్వామి

Published Sun, Dec 8 2019 8:38 PM | Last Updated on Sun, Dec 8 2019 8:49 PM

Narayana Swamy Inaugurated Liquor Prohibition Committee - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 43వేల బెల్ట్‌షాపులు తొలగించిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం గుంటురూలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయవనరుగా చూడటం లేదని పేర్కొన్నారు. సమాజంలో మద్యమే ఎన్నో అనర్థాలకు కారణమని నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement