ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరంటూ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ‘ఎన్ని కష్టాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ ఆయన నెరవేర్చుతున్నారు. అలాంటివారిని పులి అంటారు కానీ... పులిహోర బ్యాచ్‌ను పులి అనరు’ అని ఆమె వ్యాఖ్యానించారు.