
సాక్షి, అమరావతి : న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పొంగిపొర్లనుంది. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ఎక్సైజ్ శాఖ నిర్ణయం అమలు కానుంది.
కాగా, ఇప్పటికే ఏపీలోని మద్యం గోడౌన్లకు రూ. 314.65 కోట్ల లిక్కర్‌ను తరలించారు. న్యూ ఇయర్‌ను క్యాష్ చేసుకుని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్సెజ్ శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్లు అర్థం అవుతోంది. గతేడాది న్యూ ఇయర్‌కు సందడికి రూ. 252 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు వెళ్లగా.. ఇప్పడు అది రూ.314.65కు పెరిగింది. ఓవరాల్‌గా 2017లో ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు 24.85 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment