తిరువనంతపురం : దేశంలో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మూతబడ్డ మద్యం దుకాణాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా దుకాణాలకు వచ్చే వారు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రకటనలో పేర్కొంది. (మహమ్మారి కాలంలో రైల్వేస్ అరాచకం: కేరళ )
అంతేకాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దుకాణాల ముందు క్యూలైన్లను కట్టడి చేసే దిశగా ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టిపి రామకృష్ణన్ పేర్కొన్నారు. దీని ద్వారా క్యై లైన్ల వద్ద రద్దీ తగ్గుతుందని తెలిపారు. 'బెవ్య్కూ' అనే మొబైల్ యాప్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లోనే బుకింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించారు. బుకింగ్ చేసుకోగానే మీకు ఓ టోకెన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ప్రతీ నాలుగు రోజులుకు ఒకసారి మాత్రమే ఒక వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ ఆధారంగా మాత్రమే వారికి కేటాయించిన సమయాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమందిని దుకాణాల ముందు అనుమతించరని రామకృష్ణన్ తెలిపారు. (ఆ వదంతులను తోసిపుచ్చిన హోంమంత్రి )
Comments
Please login to add a commentAdd a comment