కరోనా: ‘చుక్క పడితే.. వైరస్‌ చచ్చుడే’ | Lockdown Rajasthan MLA Request CM For Opening Liquor Shops | Sakshi
Sakshi News home page

కరోనా పోవాలంటే.. మద్యం కావాల్సిందే!

Published Fri, May 1 2020 8:55 AM | Last Updated on Fri, May 1 2020 2:40 PM

Lockdown Rajasthan MLA Request CM For Opening Liquor Shops - Sakshi

జైపూర్‌: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌పూర్‌ స్పష్టం చేశారు. వైరస్‌ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్‌ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా అని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసి మద్యం దుకాణాలను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే భరత్‌సింగ్‌ తన లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు.
(చదవండి: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు)

‘మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్‌లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్‌డౌన్‌ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది’అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌పూర్‌ కోట జిల్లాలోని సంగోడ్ అసెంబ్లీ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
(చదవండి: 75 బస్సుల్లో స్వస్థలాలకు విద్యార్థులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement