ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేందకు మొగ్గు చూపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు చంద్రబాబుకు వివరించారు.
10 రోజుల్లో కొత్త మద్యం పాలసీని ఖరారు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో మద్యం షాపులకు నిర్వహణకు 15 నుంచి 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అవసరమవుతారని అంచనా వేశారు. మద్యం అమ్మకానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది.