
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. 2111 షాపులకు గాను 30987 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు.
గతేడాదితో పోలిస్తే మద్యం షాపుల కోసం వచ్చిన దరఖాస్తులు 30 శాతం పెరిగినట్టు చంద్రవదన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీస్తారని చెప్పారు. దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి 155 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. కాగా తెలంగాణలో మరో 105 షాపులకు దరఖాస్తులు అందలేదని, వీటికోసం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రవదన్ తెలిపారు.