కొచ్చి:జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు హైవేలపై ఉండటం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయనే ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైవే మార్గంలో మద్యం షాపులు ఉండటం వల్ల వాహన డ్రైవర్లు సులువుగా మద్యాన్ని సేవించి ప్రమాదాలు కారణమతున్నారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 169 లిక్కర్ షాపులను వేరే చోటకి తరలించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక అందజేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.