మద్యం షాపుల్లో స్వైపింగ్ యంత్రాలు !
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. చిల్లర కొరతతో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్టీసీ కౌంటర్లలో స్వైపింగ్ మెషిన్లు
ఆర్టీసీలో టిక్కెట్ల రిజర్వేషన్‌కు ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కార్య నిర్వహణాధికారి ఎ.కోటేశ్వరరావు తెలిపారు. నగదు రహిత చెల్లింపులు ప్రోత్సహించేందుకు ఈ చర్యలు చేపట్టామని, తొలి దశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బస్లాండ్లలో 50 స్వైపింగ్ యంత్రాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచే స్వైపింగ్ యంత్రాలను వినియోగించుకుని రిజర్వేషన్ చేయించుకోవచ్చని చెప్పారు.